హోలీ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్​ రీజన్స్​ ఇవే...

హోలీ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్​ రీజన్స్​ ఇవే...

ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజునే వచ్చే ఈ పండుగను కులమతాలకతీతంగా ఎందుకు జరుపుకుంటారు. హోలీ రోజున రంగులు చల్లుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?  ఈ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్​ రీజన్స్​ ఏమిటో  ఇప్పుడు తెలుసుకుందాం...

హోలీ' పండుగ అంటేనే కలర్ ఫుల్ కలర్స్..యూత్ లో రంగుల జోష్.. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఆనందాల పండుగ.ఈ పండుగ అనేది కేవలం సరదాలు, సంతోషాల కోసమే కాదు.. వీటి వెనుక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి.

శీతాకాలం ముగిసి వేసవికాలం ప్రారంభ సమయంలో హోలీ పండుగ జరుపుకుంటారు.  సహజంగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా బ్యాక్టీరియా వృద్ది చెందుతుందని సైన్స్​ ద్వారా తెలుస్తోంది.  అందుకే హోలీ పండుగకు ఒక రోజు ముందుగా హోలికా దహనం నిర్వహిస్తారు.  ఈ దహనం వచ్చే పొగకు బ్యాక్టీరియా నశిస్తుందని బ్యాక్టీరియా తగ్గు ముఖం పడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ సంప్రదాయంతో వాతావరణంలో వేడి ఎక్కువుగా పెరిగి.... బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది.  దీంతో బ్యాక్టీరియా నుంచి విముక్తి కలగడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండదని వైద్య నిపుణులు అంటున్నారు. 

వాతావరణంలో కలిగే మార్పులు శరీరంపై ప్రభావాన్ని చూపుతాయి.  హోలీ పండుగ ... చలికాలం ముగిసి ఎండాకాలం ప్రారంభంలో వస్తుంది.  వాతావకణంలో కలిగే మార్పులతో ప్రజలందరూ త్వరగా అలసిపోయి నీరస పడతారు.  దీంతో బద్దకంగా ఉండి ఏపని చేయడానికి ఉత్సాహం చూపరు.  అన్​ ఈజీగా ఉండి ఏ పని చేయాలన్న ఇంట్రస్ట్​ చూపరు... బద్దకంతో కాలాన్ని ఎంతో కష్టంగా గడుపుతారు.  ఇలాంటి సమయంలో హోలీ సంబరాలు జరుపుకోవడం వల్ల బద్దకం పోయి... ఉత్సాహం వచ్చి.. చురుకుగా తయారవుతారని సైన్స్​ చెబుతుంది.  హోలీ సెలబ్రేషన్స్​ లో రంగులు జల్లుకోవడం వల్ల జనాలు వీధుల్లోకి వచ్చి.. రోడ్లపైకి వచ్చి రంగులు హోలీ ఆడటం.. డ్యాన్స్​లు, డీజేలు.. పార్టీలు .. ఇతర కార్యక్రమాలు సంతోషంగా జరుపుకోవడంతో  జనాలు చురుగ్గా మారి బద్దకం వదడలడంతో ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. 

 హోలీ పండుగ వేళ చల్లుకునే రంగులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వ కాలంలో హోలీ పండుగను జరుపుకునేందుకు సేంద్రీయ రంగులను వాడేవారు. హోలీ వేడుకల్లో పసుపు రంగు కోసం పసుపు పొడిని, ఆకుపచ్చని రంగు కోసం ఆకులను వాడేవారు. అలాగే ఎండిన పువ్వులను, మోదుగ పువ్వులతో సహజ రంగులను తయారు చేసేవారు.

హోలీ పండుగ రోజున కేవలం సహజ రంగులను మాత్రమే వాడాలి. వీటిని మన శరీరంపై చల్లుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గోరింటాకు, మందార పువ్వు, చందనం, బిల్వ ఆకులు, బంతి పువ్వులు, దానిమ్మ, కుంకుమ, పలాష్, గంధం వంటి వాటితో తయారు చేసిన కలర్స్ ను వాడటం వల్ల చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే ఈ రంగులు మన జుట్టు బలపడటానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు ఈ న్యాచురల్ కలర్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి

హోలీ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ కలిసి రంగులను వాడకండి. ఇవి మీ చర్మాన్ని పాడు చేస్తాయి. సహజమైన రంగులతో తయారు చేసినే వాడండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మీద జిడ్డు మొత్తం సులభంగా తొలగిపోతుంది. దీని వల్ల మీ చర్మం మరింత కాంతివంతంగా మెరిసిపోతుంది.