జోష్​ ఫుల్​ హోళీకి సిద్ధమవుతున్న సిటీ

జోష్​ ఫుల్​ హోళీకి సిద్ధమవుతున్న సిటీ

గ్రేటర్​ వ్యాప్తంగా వెయ్యికి పైగా స్పెషల్ ఈవెంట్లు

హైదరాబాద్, వెలుగు :  చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో జోష్ నింపే పండుగ హోళీ. కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కలిసి జరుపుకునే రంగుల పండుగకు గ్రేటర్​సిటీ సిద్ధమవుతోంది. ఈసారి వెయ్యికి పైగా స్పెషల్​ఈవెంట్లు ప్లాన్​చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు మొదలైపోయాయి. టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ప్యాకేజీని బట్టి టికెట్ ధరలను నిర్ణయిస్తుంచారు. కొంతమంది ఆర్గనైజర్లు యూత్‌ ని అట్రాక్ట్ చేసేందుకు సెలబ్రిటీలను, సోషల్ ఇన్‌ఫ్లూయన్సర్లను ఈవెంట్లకు తీసుకొస్తున్నారు. గతంలో కంటే ఈసారి మరింత జాయ్​ఫుల్​గా ఉండేలా ఈవెంట్లు ప్లాన్​చేసినట్లు చెబుతున్నారు. పేటీఎం, బుక్ మై షో వంటి యాప్‌లలో బుకింగ్స్ ఓపెన్ చేశామని, సిటిజన్ల మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. ఈవెంట్లలో లైవ్ డీజే, పంజాబ్ డోల్, రెయిన్ డ్యాన్స్, ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. 

గ్రౌండ్లు, రిసార్టులు..

సిటీలోని గ్రౌండ్‌లు, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్‌లు హోళీకి రెడీ అయిపోతున్నాయి. ఇంటి చుట్టు పక్కల హోళీ ఆడుకోవడమే కాకుండా ఓపెన్​ఏరియాల్లో నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనేవారు ఏటా పెరిగిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఫేమస్ డీజేలతో, స్పెషల్ అట్రాక్షన్స్ తో ఈవెంట్లను ప్లాన్​చేస్తున్నారు. మాదాపూర్‌‌ బీస్పోర్టీలో హోలీ కే రంగ్ ఈవెంట్‌ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు రూ.199 నుంచి టికెట్ రేట్లు ఉన్నాయి. ఈ ఈవెంట్‌లో నాన్ స్టాప్ బాలీవుడ్ డీజే, లైవ్‌ ఢోల్ అండ్ బ్యాండ్, రెయిన్​డ్యాన్స్, ఆర్గానిక్ కలర్స్, ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవనున్నాయి. హోలీ సెలబ్రేషన్స్ 2023 సీజన్ 8 పేరుతో బేగంపేటలోని కంట్రీక్లబ్ లో ఈవెంట్ జరగనుంది. ఓపెన్ ఎరినా లాన్స్ లో హోళీ థీమ్ డెకరేషన్, న్యాచులర్ కలర్స్, బెలూన్ ఫైట్, వాటర్ గన్స్, కలర్స్ స్పాష్ తో ఈ వేడుకలు జరగనున్నాయి. యోలో ఏరినాలో రంగ్ బర్సే – హోలీ బ్యాష్ 2023 పేరుతో బిగ్గెస్ట్ ఓపెన్ ఏరినాలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఫ్రీ అన్‌లిమిటెడ్ ఆర్గానిక్ కలర్స్, ఫ్రీ త్రీ కోర్స్ మీల్, ట్రాన్స్, బాలీవుడ్ మ్యూజిక్ వంటివి ఉండనున్నాయి. టికెట్ రేట్లు రూ.249 నుంచి మొదలువుతున్నాయి. బౌల్డర్ హిల్స్ లో హైదరాబాద్స్ బిగ్గెస్ట్ హోలీ ఫెస్టివల్ జరగనుంది. రూ.299 నుంచి టికెట్ రేట్లు ఉన్నాయి. ఇలా ఒక్కో ఈవెంట్ ఒక్కో థీమ్ తో జరగనుంది.

బుకింగ్స్​అవుతున్నాయి

ఈసారి సిటీలో వెయ్యికి పైగా హోళీ ఈవెంట్స్ జరుగుతాయి. వీటిలో లోకల్ డీజేలతో పాటు ఇంటర్నేషనల్ డీజేలు పాల్గొంటున్నారు. మూవీ టీమ్స్, సినిమా, స్మాల్ స్క్రీన్, సోషల్ మీడియా ఇన్​ఫ్ల్యూయన్సర్లను తీసుకొస్తున్నారు. ఈసారి మరింత జోష్‌తో ఈవెంట్లు ఉంటాయని అనుకుంటున్నాం. ఇప్పటికే బుకింగ్స్ బాగా అవుతున్నాయి. టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. 

– గోపీ, ఆర్గనైజర్, జీకే మీడియా