
అమెరికాలో ఉండే పలువురు హాలీవుడ్ స్టార్స్ కు ఇప్పటికే కరోనా వైరస్ సోకినట్లుగా సమాచారం. కొందరు కరోనా నుండి బయట పడుతూ ఉంటే… సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ మరికొందరు కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. కరోనా సోకిన హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. 69 ఏళ్ల మార్క్ హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు … ఈమద్య కాలంలో వెబ్ సిరీస్ ల్లో కూడా కనిపించాడు. కరోనా వైరస్ సోకడంతో మార్క్ రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మార్క్ బ్లమ్ మృతి చెందిన విషయాన్ని ఆయన భార్య జానెట్ జరీస్ నిర్థారించారు. మార్క్ బ్లమ్ మృతితో ఆయన అభిమానులు , సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.