ఘనంగా హోంగార్డుల రైజింగ్ డే

ఘనంగా హోంగార్డుల రైజింగ్ డే

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లోని హోంగార్డు జిల్లా కార్యాలయంలో బుధవారం హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హాజరై హోంగార్డుల జెండాను ఎగురవేశారు. అనంతరం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డుల పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఉండదు కాబట్టి ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు పెన్షన్ పథకాల్లో చేరడం ఉత్తమమని సూచించారు. పోలీసులతో సమానంగా నిస్వార్థంగా విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ఉన్నతాధికారులతో చర్చించి హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వి.ఉమేందర్, సీహెచ్.నాగేందర్, పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు స్వామి, నవీన్, మురళి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, హోంగార్డ్ ఆఫీస్ అధికారులు రమేశ్,  సిబ్బంది పాల్గొన్నారు.