
ఆరోగ్యవంతమైన జుట్టు కోసం అంటూ మార్కెట్లో నెలకో ఆయిల్ రిలీజ్ అవుతూనే ఉంది. వాటి ఫలితం ఎలా ఉంటుందో తెలీదు కానీ, వందలు ఖర్చుపెట్టి కొంటుంటారు చాలామంది. అలాంటి వాళ్లు బరీదైన నూనెలు కొనుక్కునే బదులు వాటిని ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వంటింట్లో తయారు చేసిన ఈ నూనెలు జుట్టుని ఆరోగ్యంగా, అందంగా చేస్తాయి. ఇంతకీ ఆ ఆయిల్స్ వంటి, వాలేని ఎలా తయారుచేసుకోవాలి.
ఉల్లిపాయ నూనె:
కావాల్సినవి:
- కొబ్బరి నూనె-500 మి.లీ
- కరివేపాకు-కొద్దిగా
- ఉల్లిగడ్డ (తరిగి)- ఒకటి
తయారీ:
పాన్లో కొబ్బరి నూనె పోసి వేడిచేయాలి. నూనె కొంచె వేడెక్కాక తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉడికించాలి. తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి మరికొద్ది సేపు మరగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లార్చి వడపోయాలి. అంతే ఉల్లిపాయ నూనె రెడీ. దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు పెరిగేలా చేస్తాయి.
మందార నూనె:
కావాల్సినవి:
- మందార పువ్వులు- 20
- కొబ్బరి నూనె - అరకప్పు
తయారీ:
పాన్లో కొబ్బరి నూనె పోసి వేడిచేయాలి. నూనె కొంచెం వేదిక్కాక మందార. పువ్వులను కూడా వేసి ఉడికించాలి. మందారం పువ్వు రంగులో నూనె వచ్చే వరకు వేడి చేసి దించేయాలి. తర్వాత నూనెను చల్లార్చి అందులో ఐదు మందార పువ్వులను వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని వడపోసి నూనెను డబ్బాలో పోయాలి. ఈనూనె జుట్టుని ఒత్తుగా చేస్తుంది.
ఎల్లిపాయ ఆయిల్:
కావాల్సినవి:
- వెల్లుల్లి-3,
- కొబ్బరి నూనె- అరకప్పు
తయారీ:
వెలుల్లిని మెత్తగా దంచి పేస్ట్ చేయాలి. తర్వాత పాన్లో కొబ్బరి నూనె, వెల్లుల్లి పేస్ట్ వేసి వేడిచేయాలి. నూనె రంగు మారే వరకు మరిగించి దించేయాలి. చల్లార్చి వడపోసి జుట్టుకి రాయాలి. వెల్లుల్లిలోని క్యాల్షియం. సల్ఫర్, వంక్ జుట్టుని ఆరోగ్యంగా ఉంచి పెరిగేలా చేస్తాయి.
వేప నూనె:
కావాల్సినవి:
- వేపాకులు- పావు కప్పు
- కొబ్బరి నూనె- అర కప్పు
- మెంతులు-3 టేబుల్ స్పూన్లు
తయారీ:
వేపాకుల్ని మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. ఆ పేర్లని కొబ్బరి నూనెలో వేసి సన్నని మంట మీద వేడిచే యాలి. తర్వాత మెంతులు వేసి మరికొద్ది సేపు వేడి చేసి దించేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లా. ర్చి వడగట్టి డబ్బాలో పోసుకొని కావాల్సినప్పుడు జుట్టుకి రాసుకోవాలి. వేప నూనె తలలో దురద కూడా తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వడు..
రోజ్ మేరీ, తులసి నూనె:
కావాల్సినవి:
- రోజ్ మేరీ ఆకులు-గుప్పెడు
- కొబ్బరి నూనె-అరకప్పు
- తులసాకులు - గుప్పెడు.
తయారీ:
ఒక సీసాలో కొబ్బరి నూనె వేసి అందులో రోజ్ మెరీ, తులసా కులు వేసి మూత పెట్టాలి. జాడ్ని రోజుకి నాలుగైదు సార్లు షేర్ చేస్తుండాలి. ఇలా రెండు వారాలపాటు చేసి అతర్వాత మిశ్రమా న్ని వడపోసి నూనెని జుట్టుకి రాయాలి. రోజ్ మేర్లోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మాచుని ఆరోగ్యం గా ఉంచి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి.
ఉసిరికాయ నూనె:
కావాల్సినవి:
- ఉసిరి పొడి- 3టేబుల్ స్పూన్లు
- కొబ్బరి నూనె - 3 టేబుల్ స్పూన్లు
తయారీ:
పాన్లో కొబ్బరి నూనె, ఉసిరి పొడి వేసి మరిగించాలి. నూనె రంగు మారిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అమిశ్రమాన్ని గిన్నెలో పోసి కాసేపు చల్లార్చి ఆతర్వాత వడపోయాలి. ఉసిరిలోని విటమిన్-సి జుట్టుని రాలకుండా చేస్తుంది. అంతేకాదు. కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది.