
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆయన కరోనా నుంచి కోలుకున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవునున్నారని తెలిసింది. ఈ విషయంపై ఎయిమ్స్ క్లారిటీ ఇచ్చింది. ‘కరోనా ట్రీట్‌మెంట్ కోసం అమిత్ షా ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారు’ అని ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వైరస్ పాజిటివ్‌గా తేలిన అనంతరం డాక్టర్ల సూచన మేరకు ఈ నెల 18న షా ఎయిమ్స్‌లో చేరారు. ఎయిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో షాను అబ్జర్వేషన్‌లో ఉంచారు.