కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..? : మహమూద్ అలీ

కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..? :  మహమూద్ అలీ

దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం..  నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని చెప్పారు హోంమంత్రి మహమూద్ అలీ. కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చా.. చిన్న పిల్లాడు అని కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పక్కా ఆర్ఎస్ఎస్ మనిషి అని, కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ కోవర్టు అని మాట్లాడారు. కొడంగల్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా...? అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని..ఈ కామెంట్స్ చేశారు. 

సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి రావడం ఇక్కడి ప్రజల అదృష్టం అన్నారు. బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ మత కల్లోలాలు జరుగుతాయని చెప్పారు. మైనారిటీల సంక్షేమం కేవలం తెలంగాణలోనే ఉందన్నారు. మైనారిటీల అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.