ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్​..కొత్త ప్రాజెక్టులు పెరిగాయ్!

ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్​..కొత్త ప్రాజెక్టులు పెరిగాయ్!

బెంగళూరు : ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది తొలి క్వార్టర్‌‌‌‌లో తగ్గిపోయాయి. టైర్‌‌‌‌ వన్ సిటీల్లో అన్నింటిల్లో ఇదే పరిస్థితి కనిపించింది. అయితే ఇదే కాలంలో టాప్ సిటీల్లో కొత్త ప్రాజెక్ట్‌‌ల లాంచింగ్‌‌లు మాత్రం బాగా పెరిగినట్టు తాజా రిపోర్ట్‌‌ లియాస్ ఫోరాస్ తెలిపింది. లియాస్ ఫోరాస్ రిపోర్ట్ ప్రకారం.. టాప్ 8 సిటీల్లో ప్రాపర్టీ సేల్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 69,485 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే.. 212 యూనిట్లు తక్కువని లియాస్ ఫోరాస్ తెలిపింది. కానీ గతేడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో మాత్రం టాప్ 8 సిటీల్లోని ఐదు సిటీల్లో ఇళ్ల అమ్మకాలు పెరిగినట్టు పేర్కొంది. ఎక్కువ గ్రోత్ హైదరాబాద్‌‌లో, ఆ తర్వాత కోల్‌‌కతాలో ఉన్నట్టు తెలిపింది. ఎన్‌‌సీఆర్‌‌‌‌లో 19 శాతం తక్కువగా సేల్స్ పడిపోయినట్టు పేర్కొంది. ‘ఈ క్వార్టర్‌‌‌‌లో సుమారు 54 శాతం గ్రోత్.. రూ.50 లక్షల సెగ్మెంట్‌‌ నుంచే వచ్చింది. ఈ సెగ్మెంట్‌‌లో గ్రోత్‌‌ పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వల్లే నమోదైంది’ అని లియాస్ ఫోరాస్ ఎండీ పంకజ్ కపూర్ చెప్పారు.

హైదరాబాద్‌‌లో 16 శాతం పెరిగిన ధరలు…

ఈ క్యూ1లో కొన్ని మార్కెట్లలో ప్రాపర్టీ ధరలు తగ్గుముఖం పట్టాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌‌లో ధరలు 2 శాతం, ఎన్‌‌సీఆర్‌‌‌‌లో 7 శాతం ప్రాపర్టీ ధరలు తగ్గినట్టు తెలిసింది. హైదరాబాద్‌‌ మినహా మిగతా సిటీల్లో ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌‌లో అయితే ఏకంగా ప్రాపర్టీ ధరలు 16 శాతం మేర పెరిగి రికార్డు సృష్టించినట్టు లియాస్ ఫోరాస్ రిపోర్ట్ పేర్కొంది.

65,111 యూనిట్ల కొత్త లాంచెస్…

రిపోర్ట్ ప్రకారం.. టాప్ 8 సిటీల్లో కొత్త లాంచెస్ ఈ ఏడాది తొలి క్వార్టర్‌‌‌‌లో 65,111 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం అధికం. ఈ క్వార్టర్‌‌‌‌లో ఎక్కువ కొత్త లాంచెస్‌‌ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌‌లో ఉన్నాయి. 20,108 యూనిట్ల లాంచెస్‌‌తో మొత్తం లాంచెస్‌‌లో 31 శాతం ఉన్నాయి. పుణేలో 14,616 యూనిట్లు, ఎన్‌‌సీఆర్‌‌‌‌లో 9,555 యూనిట్ల లాంచెస్ జరిగాయి. కొత్త ప్రాజెక్ట్‌‌ల లాంచెస్ కూడా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్యలోనే ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌‌ నుంచి మొత్తం యూనిట్లలో 38 శాతం ఉన్నాయి. అమ్ముడుపోని యూనిట్లు వార్షికంగా 3 శాతం పెరిగినట్టు కపూర్ తెలిపారు. టాప్ 8 సిటీల్లోని అమ్ముడుపోని స్టాక్ 9,75,247 యూనిట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. కేంద్ర పాలసీలు.. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద సబ్సిడీ ఇచ్చే ఫ్లాట్‌‌ సైజు పరిమితి పెంచడం, జీఎస్టీ, రెరా అమలు వంటివి తొలుత రియాల్టీ సెక్టార్‌‌‌‌కు ఎదురు దెబ్బగా ఉన్నా.. ఆ తర్వాత ఇటు ఎండ్ యూజర్లకు, అటు డెవలపర్స్‌‌కు సాయం చేయనున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు కపూర్.