Asia Cup 2025: పర్వాలేదనిపించిన పసికూన.. శ్రీలంక ముందు హాంకాంగ్‌ ఫైటింగ్ టోటల్

Asia Cup 2025: పర్వాలేదనిపించిన పసికూన.. శ్రీలంక ముందు హాంకాంగ్‌ ఫైటింగ్ టోటల్

ఆసియా కప్ డూ ఆర్ డై మ్యాచ్ లో హాంకాంగ్‌ బ్యాటింగ్ లో రాణించింది. పటిష్టమైన శ్రీలంక బౌలర్లను తట్టుకొని ఒక మాదిరి స్కోర్  చేయగలిగింది. సోమవారం (సెప్టెంబర్ 15) దుబాయ్ ఇంటర్నేషల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హాంకాంగ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. నిజాకత్ ఖాన్ 52 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో చమీర రెండు వికెట్లు పడగొట్టాడు. హసరంగా, శనక లకు తలో వికెట్ దక్కింది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన హాంకాంగ్‌ కు మంచి ఆరంభం లభించింది. జీషన్ అలీ, అన్షుమాన్ రాత్ తొలి వికెట్ కు 4.5 ఓవర్లలో 41 పరుగులు జోడించి పవర్ ప్లే లో లంక బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. వీరి ధాటికి పవర్ ప్లే లో హాంకాంగ్‌ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. పవర్ ప్లే తర్వాత బాబర్ హయత్ నాలుగు పరుగులే చేసి పెవిలియన్ కు చేరడంతో స్వల్ప వ్యవధిలో హాంకాంగ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జీషన్ అలీ, నిజాకత్ ఖాన్ జట్టును నిలబెట్టారు. 

►ALSO READ | Asia Cup 2025: ఆసియా కప్‌లో యూఏఈ బోణీ.. ఒమన్ ఓటమితో సూపర్-4కు ఇండియా

జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. మూడో వికెట్ కు 61 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో జీషన్ అలీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జీషన్ ఔటైనా నిజాకత్ ఖాన్ చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు ఒక మాదిరి స్కోర్ అందించాడు. తొలి 10 ఓవర్లలో 62 పరుగులు చేసిన హాంకాంగ్‌.. చివరి 10 ఓవర్లలో 87 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోతే హాంకాంగ్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో 150 పరుగుల టార్గెట్ ను కాపాడుకొని టోర్నీలో నిలుస్తుందో లేదో చూడాలి.