
హువావే సబ్‌బ్రాండ్ హానర్ 20 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లను ఢిల్లీలో మంగళవారం లాంచ్ చేసింది. హానర్ 20 ప్రొ, హానర్ 20, హానర్ 20ఐ పేర్లతో వీటిని విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్, కంపెనీ సొంత ఈ–స్టోర్‌లో ఇవి అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ చెప్పింది. హానర్ 20(6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.32,999 కాగా, హానర్ 20 ప్రొ(8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ ఆప్షన్) ధర రూ.39,999గా కంపెనీ పేర్కొంది. హానర్ 20ఐ(4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కే లాంచ్ చేసింది.