ఇద్దరు మంచిర్యాల జిల్లా వాసులకు గౌరవ డాక్టరేట్

ఇద్దరు మంచిర్యాల జిల్లా వాసులకు గౌరవ డాక్టరేట్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా వాసి రాపోలు విష్ణువర్ధన్ రావుకు హోప్ థియోలాజికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది. హైదరాబాద్​లోని కళా మారుతి వేదికలో బుధవారం సాయంత్రం ప్రదానం చేశారు. గణిత అధ్యాపకునిగా జీవితం ప్రారంభించి విష్ణువర్ధన్ ​రావు 2003లో ఓ ప్రైవేట్ కాలేజీ స్థాపించారు. 2011 నుంచి రివిలేషన్ స్కూల్​ను నడిపిస్తూ, 2024లో గుడిపేటలో రివిలేషన్ ఫ్యూచర్ మైండ్స్ స్కూల్​ను నెలకొల్పారు. 

రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం(టీపీజేఎంఏ) జిల్లా అధ్యక్షుడిగా, మంచిర్యాల జిల్లా తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల సంఘం(ట్రాస్మా) జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో సేవలందించారు. 

కలమడుగు వాసికి..

జన్నారం,వెలుగు: జన్నారం మండలం కలమడుగుకు చెందిన యాదగిరి శేఖర్ రావుకు డాక్టరేట్ దక్కింది.శేఖర్ రావు గతంలో ట్రస్మా స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసి ప్రస్తుతం ఆ సంఘం గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ట్రస్ట్​ను స్థాపించి నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాజిక సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ​అందుకున్నారు