ఐఐటీ బాంబే కుర్రాళ్ల ఘనత.. ఈ బైకును ఈజీగా మడత పెట్టొచ్చు

ఐఐటీ బాంబే కుర్రాళ్ల ఘనత.. ఈ బైకును ఈజీగా మడత పెట్టొచ్చు

సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే  ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వింతలు విశేషాలు, కొత్త విషయాలు, వైరల్ వీడియోలను  తన ట్విట్టర్ లో  షేర్ చేస్తుంటారు. లేటెస్ట్ గా  ఆనంద్ మహీంద్రా ఓ ఈ బైక్ ఫోటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ బైకును మడత పెట్టేయొచ్చని చెప్పారు.  ఐఐటీ బాంబే కుర్రాళ్లు ఈ బైకును రూపొందించారని ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా  ఇలాంటి బైక్ లేదన్నారు. 

ఐఐటీ బాంబే కుర్రాళ్ల  మళ్లీ మనల్ని గర్వపడేలా చేశారని.. ప్రపంచంలోనే  మొదటి ఫోల్డబుల్  డైమండ్ ఫ్రేమ్ ఇ- బైక్ ఇదేనని ట్వీట్ చేశారు మహీంద్ర.  ఇది ఇతర బైకుల కంటే 35 శాతం  సమర్థవంతంగా   పనిచేయడమే గాకుండా మీడియం వేగం దగ్గర మరింత స్థిరంగా ఉంటుందన్నారు.  అంతేగాకుండా ఈ బైకును మడత పెట్టేటప్పుడు పైకి ఎత్తాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ బైకు పేరు హార్నా బైక్  ఎక్స్ 1 అని..  తన ఆఫీసు చుట్టూ ఇపుడే  ఓ  రౌండ్ వేశానని అన్నారు. వాళ్ల స్టార్టప్ కంపెనీల్లో తాను పెట్టుబడి కూడా పెట్టానని చెప్పారు.  

Also Read :- విస్తరిస్తున్న ఒయాసిస్​ ఫెర్టిలిటీ

ప్రస్తుతం ఈ ఈ బైక్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉందని ట్వీట్ చేశారు మహీంద్రా. ఈ ఈ బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 45 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని కాస్ట్ రూ. 45 వేలుగా ఉందన్నారు.