
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 20)
సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చలు. అదనపు ఆదాయం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శత్రువుల్ని కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. గృహం కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఒక సమాచారం లేదా సంఘటన ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
వృషభం (ఏప్రిల్ 21 – మే 21)
విజ్ఞానాన్ని పెంచుకునే దిశగా అడుగులు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వివాహయత్నాలు అనుకూలం. విద్యార్థులు భవిష్యత్తు కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందిస్తారు. విదేశీ ఉద్యోగావకాశాలు దక్కే ఛాన్స్. వ్యాపారుల చిరకాల కోరిక నెరవేరుతుంది. లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు.
మిథునం (మే 22 – జూన్ 22)
అనుకున్న వెంటనే కొత్త కార్యాలు చేపట్టి పూర్తి చేస్తారు. సన్నిహితులతో విభేదాలు. ఆలోచనలు అంతగా కలసిరాకపోవచ్చు. ఆదాయం కొంత పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో కుటుంబ విషయాలపై చర్చిస్తారు. తరచూ ప్రయాణాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వ్యాపారుల కృషి కొంతమేర ఫలిస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి.
కర్కాటకం (జూన్ 23 – జూలై 23)
పొరపాటున తీసుకున్న నిర్ణయాలు సరిదిద్దుకుంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్య కార్యాలు విజయవంతంగా కొనసాగుతాయి. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. విద్యార్థుల కృషి కొంతమేర ఫలిస్తుంది. పలుకుబడి పెంచుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. సమాజంలో పేరుప్రతిష్ఠలు. వ్యాపారులకు ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.
సింహం (జూలై 24 – ఆగస్టు 22)
ముఖ్యమైన కార్యాలలో ముందడుగు. ఆత్మీయులు దగ్గరవుతారు. విద్యార్థులకు ఆసక్తికర సమాచారం. ఆదాయం ఆశాజనకం. ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. అందరిలో ప్రత్యేక గుర్తింపు. మీ శక్తిసామర్థ్యాలు గుర్తింపులోకి వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారులు క్రమేపీ లాభపడతారు. ఉద్యోగులు అనుకున్న బాధ్యతలు నెరవేర్చడంలో సఫలమవుతారు.
కన్య (ఆగస్టు 23 – సెప్టెంబర్ 22)
ఆశ్చర్యపరిచే సమాచారం అందుతుంది. ఆశించిన రాబడి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. శత్రువులు సైతం మీ దారికి వస్తారు. ఆస్తుల వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రోత్సాహకరంగా ఉంటుంది.
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
భవిష్యత్తు అంచనాలు రూపొందిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులు మరింత శ్రమిస్తే శుభం జరుగుతుంది. అనుకున్న రాబడి దక్కినా కొంత నిరుత్సాహం చెందుతారు. భూముల కొనుగోలు ఒప్పందాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు ఉత్సాహం. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు.
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 22)
ముఖ్య కార్యాలలో ఆటంకాలు అధిగమిస్తారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది. స్థిరాస్తిని పెంచుకుంటారు. జీవితంలో మరపురాని సంఘటన ఎదురుకావచ్చు. శత్రువులు కూడా స్నేహితులుగా మారడం విశేషం. కోర్టు కేసులు కొన్ని కొలిక్కి వచ్చే అవకాశం. బహుమతులు, గ్రీటింగ్‌లు అందుకుంటారు. వ్యాపారులు క్రమేపీ లాభపడతారు. ఉద్యోగులు కొత్త హోదాలు పొందుతారు.
ధనుస్సు (నవంబర్ 23 – డిసెంబర్ 22)
పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం. విద్యార్థులకు విజయాలు. భూముల వ్యవహారంలో చిక్కులు తొలగుతాయి. వివాహ, విదేశీ ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారులకు భాగస్వాముల నుంచి పూర్తి సాయం. ఉద్యోగులు వివాదాల నుంచి గట్టెక్కుతారు.
మకరం (డిసెంబర్ 23 – జనవరి 22)
ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆత్మీయులతో ఉన్న వివాదాల సర్దుబాటు. ఉద్యోగాన్వేషణలో విజయం. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వాహనసౌఖ్యం. మీ నిర్ణయాలు, అభిప్రాయాలు అందరి ప్రశంసలు పొందుతాయి. వ్యాపారులకు కొంతమేర లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగులు కొత్త పోస్టుల కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
కుంభం (జనవరి 23 – ఫిబ్రవరి 22)
కార్యదీక్షలో ముందడుగు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది వేడుకల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులకు మరిన్ని విజయాలు. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
మీనం (ఫిబ్రవరి 23 – మార్చి 20)
పోటీతత్వం మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. అనుకున్న రాబడి. వివాహాది వేడుకల నిర్వహణలో నిమగ్నం. ఆలోచనలకు కార్యరూపం. నిరుద్యోగులు ప్రతిభ కనబరుస్తారు. దీర్ఘకాలిక సమస్యలు వేధించినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. ముఖ్యమైన కార్యాలు కొన్ని విజయవంతంగా పూర్తి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఊహించని హోదాలు.
- వక్కంతం చంద్రమౌళి, జ్యోతిష్య పండితులు, ఫోన్: 98852 99400