యశ్‌‌‌‌కు జంటగా కాజల్.. రావణుడి భార్య మండోదరి పాత్రలో..

యశ్‌‌‌‌కు జంటగా కాజల్.. రావణుడి భార్య మండోదరి పాత్రలో..

సౌత్‌‌‌‌తో పాటు నార్త్‌‌‌‌లోనూ కాజల్ అగర్వాల్‌‌‌‌కు మంచి గుర్తింపు ఉంది. అక్కడ హీరోయిన్‌‌‌‌గా పలు చిత్రాల్లో నటించడంతో పాటు ఇటీవల సల్మాన్ ఖాన్ ‘సికందర్‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌కు ఆమె సైన్ చేసింది.  రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘దంగల్‌‌‌‌’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణుడి భార్య మండోదరి పాత్రను కాజల్ పోషిస్తోంది.

రావణుడి పాత్రలో యశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. తనకు జంటగా కాజల్ కనిపించబోతోంది. గతంలో ఈ పాత్రను సాక్షి తన్వర్‌‌‌‌‌‌‌‌ పోషించబోతోందని వార్తలొచ్చాయి. కానీ ఇటీవల కాజల్‌‌‌‌కు లుక్ టెస్ట్‌‌‌‌ చేసి ఫైనల్ చేశారు. ఏప్రిల్‌‌‌‌ నెలాఖరు నుంచి యశ్ ఈ మూవీ షూటింగ్‌‌‌‌లో పాల్గొంటున్నాడు. రీసెంట్‌‌‌‌గా కాజల్ కూడా షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయింది. తన భర్త రావణుడి తప్పులను ఎత్తిచూపుతూ ధర్మం వైపు నిలబడే పాత్ర ఆమెది. నటనకు ఆస్కారమున్న పాత్ర కావడంతో తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో మైలురాయిగా నిలిచిపోయే అవకాశముంది. ఇక మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రంలో పార్వతీదేవిగా కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే.