ఢిల్లీలో ఘోరం.. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి.. ఎంబీబీఎస్ విద్యార్థినిపై అఘాయిత్యం..

ఢిల్లీలో ఘోరం..  కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి.. ఎంబీబీఎస్ విద్యార్థినిపై అఘాయిత్యం..

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకున్నది.  పార్టీ పేరుతో హోటల్‌‌కు పిలిచి, 18 ఏండ్ల ఎంబీబీఎస్ విద్యార్థినికి డ్రింక్‌‌లో మత్తుమందు కలిపి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని వీడియో తీసిన అతడి ఇద్దరు స్నేహితులు, దానిని అడ్డం పెట్టుకుని నెల రోజులపాటు ఆమెను బ్లాక్‌‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా.. వారికోసం గాలిస్తున్నారు. ఈ ఘటన నార్త్‌‌వెస్ట్‌‌ ఢిల్లీలోని ఆదర్శ్‌‌నగర్‌‌‌‌లో చోటు చేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని జింద్‌‌కు చెందిన బాధితురాలు ఢిల్లీలో హాస్టల్‌‌లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతున్నది. అదే ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల యువకుడు, కాంపిటేటివ్​ ఎగ్జామ్స్‌‌కు  ప్రిపేర్​ అవుతున్నాడు. వీరిద్దరికీ ముందునుంచే పరిచయం ఉంది. గత నెల 9న తన ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని నమ్మించి బాధితురాలిని హోటల్ గదికి యువకుడు పిలిచాడు. కూల్‌‌డ్రింక్‌‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. యువతి స్పృహ కోల్పోయాక ముగ్గురూ అత్యాచారం చేశారు.  

సోషల్ మీడియాలో పెడ్తామని బెదిరించి..

ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ, సెప్టెంబర్ నెలలో పలుమార్లు రేప్​ చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్టు డిప్యూటీ కమిషనర్‌‌‌‌ ఆఫ్​ పోలీస్​ భీషమ్‌‌ సింగ్​తెలిపారు.