
కరీంనగర్ టౌన్, వెలుగు: పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలని హాస్పిటల్ కార్మికులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడుతూ హాస్పిటల్‌లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, ప్లంబర్ కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హాస్పిటల్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ పి.అరుణ్, ప్రధానకార్యదర్శి పి.కళావతి, రాజు, రేఖ, శంకర్, శారద, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.