మారోలిక్స్​ నుంచి హాస్పిటల్​ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్

మారోలిక్స్​ నుంచి హాస్పిటల్​ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్

హైదరాబాద్​, వెలుగు:   నగరానికి చెందిన ఐటీ స్టాఫింగ్​, సాఫ్ట్​వేర్​డెవెలప్​మెంట్​ కంపెనీ మారోలిక్స్​‘హాస్పియోల్’ పేరుతో హాస్పిటల్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్  సాఫ్ట్‌‌వేర్​ను లాంచ్​ చేసింది. దీని ద్వారా హాస్పిటళ్లకు, రోగికి అవసరమైన వివరాలు ఎప్పుడూ ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటాయి. మెడికల్​ రికార్డుల ట్రాకింగ్, అపాయింట్‌‌మెంట్ల షెడ్యూలింగ్​, బిల్లింగ్, ఇన్సూరెన్స్ ​వంటి 23 మాడ్యూల్స్ ఇందులో ఉంటాయి. 

హాస్పిటళ్లు తమ అవసరాలను బట్టి మాడ్యూళ్లను తీసుకోవచ్చని మారోలిక్స్ ​తెలిపింది. ప్రతి కస్టమర్ అవసరాలకు,  ప్రాధాన్యతలకు అనుగుణంగా సాఫ్ట్​వేర్​లో ఫీచర్లను చేర్చామని ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్ డెవలప్‌‌మెంట్ మేనేజర్ అభిలాష్ మాట్లాడుతూ, రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆసుపత్రులకు హాస్పియోల్​ పూర్తిస్థాయి హెల్త్​కేర్​ సేవలను అందిస్తుందని చెప్పారు. 

‘‘మా హెల్త్‌‌కేర్ సొల్యూషన్  ప్రత్యేక లక్షణం ఏమిటంటే, మేం రోగికి లాగిన్ కూడా ఇస్తాం. ఈ ఫీచర్‌‌తో, రోగి లాగిన్ అయి మెడికల్ రికార్డ్‌‌ను ట్రాక్ చేయవచ్చు. బాధితుడు వేరే ఊళ్లో ఉన్నప్పుడు  అక్కడి డాక్టర్​ను సంప్రదించవచ్చు. అప్పుడే తన మెడికల్​ రికార్డులను చూపెట్టవచ్చు. ఇప్పటికే తనను చూస్తున్న డాక్టర్​ను కన్సల్ట్​ కావడానికి హాస్పియోల్​లో లాగిన్ కావాలి”అని ఆయన వివరించారు.