ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌ ఖేల్‌‌‌‌ ఖతం

ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌ ఖేల్‌‌‌‌ ఖతం

దోహా: వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌లోనూ ఓడిన ఆతిథ్య ఖతార్‌‌‌‌ ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నాకౌట్‌‌‌‌ రేసు నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో సెనెగల్‌‌‌‌ 3–1తో ఖతార్‌‌‌‌ను చిత్తు చేసింది. స్ట్రైకర్‌‌‌‌ బౌలయె దియా 41వ నిమిషంలో సెనెగల్‌‌‌‌కు తొలి గోల్‌‌‌‌ అందించగా.. ఫమారా (48వ. ని) ఆధిక్యాన్ని డబుల్‌‌‌‌ చేశాడు. 78వ నిమిషంలో ముంటారి గోల్‌‌‌‌ చేసి 1–2తో ఖతార్‌‌‌‌ను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, బంబా డియెంగ్‌‌‌‌ సెనెగల్‌‌‌‌కు మూడో గోల్‌‌‌‌ అందించి ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించాడు.