Good Health : వేడి నీళ్లతో స్నానం చేస్తే బరువు తగ్గుతారా.. పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

Good Health : వేడి నీళ్లతో స్నానం చేస్తే బరువు తగ్గుతారా.. పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

బరువు తగ్గడానికి రకరకాల ప్రయాత్నాలు చేసి విసిగిపోయినరా? ఎక్సర్ సైజులు.. కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నా.. రిజల్ట్ కినిపిస్తలేదా? అయితే, ఒకవైపు ఈ నియమాలు పాటిస్తూనే.. వేడి నీళ్లతో స్నానం చేస్తే బరువు తగ్గుతరని లండన్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో తేలింది. వేడి నీళ్లతో స్నానం చేస్తే.. అది 30 నిమిషాల వాకింగ్ తో సమానమట. 

శరీరాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ఫిట్ గా ఉంచుకోవడానికి వాకింగ్, ఎక్సర్ సైజ్, జిమ్ తో పాటు వేడి నీళ్ల స్నానం కూడా సాయపడుతుందని పరిశోధకులు అంటున్నరు. మొత్తం 14 మంది పురుషులపై ఈ అధ్యయనం చేపట్టినరు. వీళ్లందరూ మొదట గంటసేపు సైకిల్ తొక్కడం, వాకింగ్ లాంటి వ్యాయామాలు చేశారు. తర్వాత గంట వేడి నీటి టబ్ లో ఉన్నరు. ఈ రెండు పరీక్షల్లో ఖర్చయిన కేలరీలను లెక్కిస్తే సమానంగా తగ్గినయ్. అంతేకాకుండా రోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో 130 క్యాలరీలు తగ్గించుకోవచ్చని వైద్యులు అంటున్నరు. సాధారణంగా వేడి నీళ్లు శరీర బరువును తగ్గించే ప్రక్రియను వేగవంతం చేసి శరీరంలోని వేడిని తగ్గిస్తయట. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఇదే ప్రక్రియ జరుగుతదట. దీంతో బరువు తగ్గుతరని వైద్యులు చెబుతున్నారు.' అని ఆయన చెప్పినరు.