కరోనా పేషెంట్లకు హోటల్సా?

కరోనా పేషెంట్లకు హోటల్సా?

కరోనా పాజిటివ్ పేషెంట్ల హాస్పిటలైజేషన్‌‌కు హోటల్స్ వాడాలని ఆదేశించడంపై హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సెక్టార్‌‌‌‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా నిలువనుందని పేర్కొంటోంది. మాన్‌‌సింగ్‌‌ రోడ్డులో ఉన్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్‌‌సీఎల్) ఐకానిక్ హోటల్ తాజ్ మహల్ హోటల్‌‌ లో రూమ్‌‌లను, దాని పరిసర ప్రాంతాలను సర్ గంగా రామ్ హాస్పిటల్‌‌కు చెందిన కరోనా పేషెంట్లకు కేటాయించాలని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇంతకుముందు జారీ చేసిన ఆదేశాలపై కూడా ఇతర హోటల్స్  భయపడుతున్నాయి. ఈ విషయంపై ఇండస్ట్రీ బాడీ ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌‌హెచ్‌‌ఆర్‌‌‌‌ఏఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది. హోటల్స్‌‌లో ‌‌ కరోనా పాజిటివ్ పేషెంట్ల చికిత్సకు తగిన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌, అవసరమయ్యే క్రిటికల్ కేర్ ఎన్విరాన్‌‌మెంట్ లేవని చెప్పింది. హోటల్ స్టాఫ్‌‌ హెల్త్‌‌కేర్ ప్రొఫెషనల్‌‌ లాగా ట్రైన్ అయ్యి ఉండరని, అన్ని నైపుణ్యాలు ఉండవని చెప్పింది. కరోనా హాస్పిటల్‌‌గా హోటల్స్‌‌ను మార్చాలనే ఆదేశాలు తమ వ్యాపారాలపై ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పేషెంట్లకు వాడిన రూమ్‌‌లను మళ్లీ రినొవేషన్‌‌ చేయడం కూడా బాగా నష్టపరచనుందని, పబ్లిక్‌‌ సెంటిమెంట్ కాస్త దెబ్బతినే అవకాశముందని పేర్కొంటోంది. అశోకా, సామ్రాట్ వంటి ప్రభుత్వానికి చెందిన హోటల్స్‌‌కు ఇలాంటి ఆదేశాలు లేకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఎఫ్‌‌హెచ్‌‌ఆర్‌‌‌‌ఏఐ వైస్ ప్రెసిడెంట్ గుర్‌‌‌‌బాక్సిస్ సింగ్ కోహ్లి వ్యాఖ్యానించారు. హోటల్స్‌‌కు ఇచ్చే పరిహారాలపై కూడా స్పష్టత లేదని, బిల్లుల సెటిల్‌‌మెంట్‌‌లో బాగా జాప్యం జరుగుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది.