హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా అందుబాటులోకి 51,470 ఇండ్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా అందుబాటులోకి  51,470 ఇండ్లు
  • దేశంలో కొత్తగా అందుబాటులోకి 3,57,635 యూనిట్లు
  • కిందటి ఏడాదితో పోలిస్తే 51 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ:పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించడానికి బిల్డర్లు మరిన్ని ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించడంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్​ ప్రాపర్టీ బాగా పెరిగింది. కిందటి ఏడాదితో పోలిస్తే పెరుగుదల 51 శాతం ఉంది. 2022లో మొత్తం  3,57,635 యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి.  ఏడు ప్రధాన నగరాల్లో 2021 సంవత్సరంలో 2,36,693 యూనిట్లు లాంచ్​ అయ్యాయని  హౌసింగ్ బ్రోకరేజ్ అనరాక్​  పేర్కొంది. 

ముంబై , కోల్‌‌‌‌‌‌‌‌కతా, బెంగళూరు, హైదరాబాద్,  పూణే నగరాల్లో హౌసింగ్ ప్రాజెక్టులు పెరిగాయి. అయితే ఢిల్లీ–-ఎన్​సీఆర్,​  చెన్నైలలో తగ్గాయి. ఏడు నగరాల్లో నిరుడు వచ్చిన కొత్త ప్రాజెక్టుల సంఖ్య 2014లో లాంచ్​ అయినవాటి కంటే తక్కువగానే ఉంది. 2014 సంవత్సరంలో 5.45 లక్షల యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఎంఎంఆర్​లో కొత్త లాంచ్‌‌‌‌‌‌‌‌లు మునుపటి సంవత్సరంలో 56,883 యూనిట్ల నుంచి 2022లో 1,24,652 యూనిట్లకు.. అంటే రెండింతలు పెరిగాయి. బెంగళూరులో కొత్త లాంచ్‌‌‌‌‌‌‌‌లు 61 శాతం పెరిగి 2022లో 30,646 యూనిట్ల నుంచి 49,196 యూనిట్లకు పెరిగాయి. పూణెలో కొత్త లాంచ్​లు 2021లో 39,869 యూనిట్ల నుంచి 64,343 యూనిట్లకు పెరిగింది. ఈ సిటీ 61 శాతం వృద్ధిని సాధించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కొత్త లాంచ్‌‌‌‌‌‌‌‌లు 51,470 యూనిట్ల నుంచి 32 శాతం పెరిగి 68,007 యూనిట్లకు చేరుకోగా, కోల్‌‌‌‌‌‌‌‌కతాలో గత ఏడాది 13,746 యూనిట్ల నుంచి 17 శాతం పెరిగి 16,088 యూనిట్లకు చేరుకున్నాయి. 

రెండు సిటీల్లో తగ్గుదల

చెన్నైలో కొత్త లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 19 శాతం తగ్గాయి. 2022లో 12,373 యూనిట్ల నుంచి 9,994 యూనిట్లకు పడిపోయాయి. ఢిల్లీ-ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిఆర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, రెసిడెన్షియల్ ప్రాపర్టీల కొత్త లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు   31,706 యూనిట్ల నుంచి 25,355 యూనిట్లకు పడిపోయాయి. ఈ విషయమై అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ, కొత్త లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చాలా పెద్ద నగరాల్లో ఇక నుంచి కూడా బాగానే ఉంటాయని అన్నారు. మిగతా వాటి కంటే రెడీ టూ మూవ్​ ఇండ్లకు డిమాండ్​ ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ ఏడాది పెద్ద, లిస్టెడ్​ రియల్టర్ల నుంచి భారీగా ప్రాజెక్టులు వస్తాయని చెప్పారు. 

వీళ్లపై కస్టమర్లకు నమ్మకం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.  2022లో ఈ ఏడు నగరాల్లో ఇండ్ల అమ్మకాలు 54 శాతం పెరిగి 3,64,873 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది  ఆల్ టైమ్ హై అని అంతకుముందు సంవత్సరంలో 2,36,516 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని పూరి వివరించారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్, డిమాండ్ తిరిగిరావడం కారణంగా ధరలు అన్ని నగరాల్లో ధరలు 4–7 శాతం వరకు పెరిగాయని చెప్పారు. 2022 చివరి నాటికి ఈ ఏడు నగరాల్లో అమ్ముడుపోని హౌసింగ్ స్టాక్ 6,30,953 యూనిట్లుగా ఉంది.