మోడీకి ఒక్క నోటీసైనా ఇచ్చారా?

మోడీకి ఒక్క నోటీసైనా ఇచ్చారా?

దంజూర్: ఎన్నికల కమిషన్ తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆమె విమర్శలకు దిగారు. హిందూ- ముస్లింల గురించి ప్రతి రోజూ మాట్లాడే మోడీకి ఈసీ ఒక్క నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. 'నాకు పది షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఫర్వాలేదు. మోడీకి ఎన్ని నోటీసులు ఇచ్చారు? ఆయన మీద ఎన్ని ఫిర్యాదులు నమోదు చేశారో చెప్పాలి. నందిగ్రాం ముస్లిములను పాకిస్తానీలుగా పిలిచిన వారి మీద ఎన్ని కంప్లెయింట్ లు రిజిస్టర్ చేశారు? వాళ్లకు సిగ్గుగా లేదా? నేను హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులను సమానంగా చూస్తా. అలాగే గిరిజనులూ నాకు అంతే సమానం' అని మమత పేర్కొన్నారు. అన్ని మతాల వారు తనకు అండగా ఉన్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని మమత వివరించారు.