చంద్రయాన్‌ 3..రోవర్‌‌‌‌ పనిచేసేది 14 రోజులేనా?

చంద్రయాన్‌ 3..రోవర్‌‌‌‌ పనిచేసేది 14 రోజులేనా?

చంద్రయాన్‌‌పై కాలు మోపిన రోవర్‌‌‌‌కు అవసరమైన విద్యుత్ సోలార్​ ప్యానెళ్ల నుంచే వస్తుంది. అందుకే చంద్రుడి దక్షిణ ధృవంపై సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండర్‌‌ మాడ్యూల్‌‌ను దించింది ఇస్రో. అయితే.. చంద్రుడి మీద ఒక్క పగలు భూమ్మీద14 రోజులకు సమానం. ఈ 14 రోజుల్లో సూర్యరశ్మి ద్వారా అక్కడున్న ల్యాండర్, రోవర్లకు విద్యుత్ అందుతుంది. కాబట్టి అవి 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి. 

ఆ తర్వాత అక్కడ రాత్రి అవుతుంది. మామూలుగా చంద్రుడి ఈక్వేటర్ దగ్గర పగటి ఉష్ణోగ్రతలు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. రాత్రి వేళ్లలో మైనస్ 120 డిగ్రీల సెల్సియస్‌‌కు పడిపోతాయి. అదే చంద్రుడి ధృవాల దగ్గరకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. ఉన్న కొన్ని షాడోడ్ రీజియన్స్‌‌లో మైనస్ 230 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతాయి. 

చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్లు కూడా దక్షిణ ధృవంలోనే ఉన్నాయి. అంటే అక్కడ 14 రోజుల పాటు బాగా చల్లగా ఉంటుంది. ఆ టెంపరేచర్లను తట్టుకుని వాటిలోని ఎక్విప్‌‌మెంట్స్‌‌, బ్యాటరీలు తిరిగి పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. అందుకే వీటి జీవిత కాలం14 రోజులు మాత్రమే అని ఇస్రో చెప్తోంది.