
స్మార్ట్ వాచ్‌లను చాలా మంది విలాసవంతమైన వస్తువుగా పరిగణిస్తారు. అయితే ఇది వారి శ్రేయస్సును కోరి, అప్రమత్తం చేయడంలో రక్షకునిగానూ పని చేస్తుండడం చెప్పుకోదగిన విషయం. తాజాగా ఒక స్మార్ట్ వాచ్.. యూకే బేస్డ్ 42 ఏళ్ల CEOకి గుండెపోటు నుంచి అప్రమత్తమయ్యేలా చేసింది. హాకీ వేల్స్ CEO అయిన పాల్ వాపమ్, స్వాన్సీలోని మోరిస్టన్ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర తన రోజువారీ దినచర్యలో భాగంగా మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. "నేను రోజూ లాగే ఉదయం 7 గంటలకు వాకింగ్ కోసం వెళ్ళాను. ఐదు నిమిషాలలోనే నాకు ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది" అని చెప్పాడు.
"నా ఛాతి బిగుతుగా అనిపించింది. కాసేపట్లోనే నేను రోడ్డుపై పడిపోయాను. మొదట్లో, ఇది కొంచెం నొప్పిగా మొదలై.. ఆ తర్వాత తీవ్రమైన నొప్పిగా మారింది. నేను నా వాచ్ ను ఉపయోగించి నొప్పిని ముందుగానే గ్రహించాను. వెంటనే నా భార్య లారాకు ఫోన్ చేయడంతో అదృష్టవశాత్తూ, నేను కేవలం ఇంటికి ఐదు నిమిషాల దూరంలో ఉండడంతో ఆమె నన్ను కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగలిగింది. ఆమె పారామెడిక్స్‌ను పిలవడంతో.. వారు వెంటనే వచ్చి చికిత్స చేశారు" అన్నారాయన.
ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన పాల్ ఇటీవల జరిగిన సంఘటన షాక్‌కి గురి చేసింది. "ఇది నిజంగా నా కుటుంబంతో సహా అందరికీ షాక్. నేను పొందిన సంరక్షణ అద్భుతమైనది. నేను సిబ్బంది గురించి ఎక్కువ మాట్లాడలేను. నన్ను ఆసుపత్రికి తీసుకువచ్చినందుకు నా భార్యకు నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇది ఆమెకు కూడా షాక్ కు గురి చేసింది" అని CEO అన్నారు.
ఆపిల్ వాచ్ 36 ఏళ్ల జీవితాన్ని నిలబెట్టింది..
స్మార్ట్ వాచ్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడటం ఇదేం మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఓ 36 ఏళ్ల UK వ్యక్తి తన ఆపిల్ వాచ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆడమ్ క్రాఫ్ట్ అనే వ్యక్తి తన స్మార్ట్ వాచ్ తన సక్రమంగా లేని హార్ట్‌బీక్ గురించి రాత్రంతా తనను హెచ్చరించిందని తెలిపాడు.
Also Read :- బాణాసంచా దుకాణం కోసం లంచం .. ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్