పాస్‌పోర్ట్ కావాలా.. ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా అప్లయ్ చేసుకోవచ్చు.. వారంలో వస్తుంది.. !

పాస్‌పోర్ట్ కావాలా.. ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా అప్లయ్ చేసుకోవచ్చు.. వారంలో వస్తుంది.. !

ప్రస్తుతం పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేసుకోవడం చాల ఈజీ అయ్యింది. ఇంకా పాస్‌పోర్ట్ అప్లయ్ చేసే  ప్రక్రియ పూర్తి కావడానికి, పాస్‌పోర్ట్ డెలివరీకి పట్టే సమయం కూడా తగ్గింది. కానీ కొన్ని ఏళ్ళకి ముందు పాస్‌పోర్ట్ చేతికి రావాలంటే వారాల నుండి నెలలు పట్టేది.  
 
పాస్‌పోర్ట్ అనేది విదేశాలకు వెళ్లడానికి ఎక్కువగా ఉపయోగపడే ఒక ప్రూఫ్ ఇంకా గుర్తింపు ఆధారం. దీనిని దేశ ప్రభుత్వం జారీ చేస్తుంది, పాస్‌పోర్ట్ అనేది ఒక వ్యక్తి  గుర్తింపు అలాగే జాతీయతను నిర్ధారిస్తుంది. ఇందులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఫోటో, సంతకంతో పాటు  ఇతర వివరాలు ఉంటాయి.

భారతదేశంలో పాస్‌పోర్ట్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) జారీ చేస్తుంది. భారతీయ పౌరులు పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సేవా అనే ప్రత్యేక ఆన్‌లైన్ సేవను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా  పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి, ఇందుకు కొన్ని పద్ధతులు పాటించాలి.  ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత చివరగా పాస్‌పోర్ట్ సేవా సెంటర్  లేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసుకీ  వెళ్లాల్సి ఉంటుంది.    
 
 పాస్‌పోర్ట్ కోసం కావాల్సిన డాకుమెంట్స్ : భారతదేశంలో పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేసుకోవడానికి  అవసరమైన అన్ని ఒరిజినల్ డాకుమెంట్స్  రెడీ చేసుకొని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి లేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసులో మొదట రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక అపాయింట్‌మెంట్ కోసం తీసుకెళ్లాల్సిన డాకుమెంట్స్  లిస్ట్ MEA జారీ చేసింది. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు పాస్‌పోర్ట్ సేవా సెంటర్  వెళ్లేందుకు 90 రోజుల సమయం ఇస్తారు.
 
పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేసుకోవాలంటే :
1. మొదట పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌కి వెళ్లి Register Now (https://portal2.passportindia.gov.in) లింక్‌పై క్లిక్ చేయండి.
 
2. ఇక్కడ అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న పాస్‌పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి.  అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, క్యాప్చాను టైప్ చేసి 'Register' పై క్లిక్ చేయాలి. 
 
3. తరువాత మీ రిజిస్టర్డ్ లాగిన్ వివరాలతో పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
 
4. ఇప్పుడు 'Apply for Fresh Passport/ Re-issue of Passport' లింక్‌ క్లిక్ చేయాలి. అయితే కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేస్తే మీకు ఇంతకు ముందు లేదా గతంలో భారతదేశ పాస్‌పోర్ట్ ఉండకూడదు అని  గుర్తుంచుకోవాలి. 
 
5. ఇక్కడ అవసరమైన అన్ని వివరాలను ఎంటర్  చేసి submit బటన్ పై క్లిక్ చేయండి.
 
6. సేవ్ చేసిన/సబ్మిట్ చేసిన ఫార్మ్ వివరాలు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ..  స్క్రీన్‌ పైన పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అపాయింట్‌మెంట్ కోసం మీరు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత మీ అప్లికేషన్ ఫీజు రిసిప్ట్ ప్రింట్ తీసుకోవడానికి  'ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్' పై క్లిక్ చేయాలి.

ALSO READ : బైక్.. కార్.. కొనాలనుకుంటున్నారా..?
 
7.  ఇప్పుడు మీ అపాయింట్‌మెంట్ అన్ని వివరాలతో మీకు ఒక SMS వస్తుంది. 
 
8. దింతో మీ ఆన్‌లైన్ ప్రక్రియ ఇప్పుడు పూర్తవుతుంది. తరువాత మీరు అపాయింట్‌మెంట్ తీసుకున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని లేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీస్ భౌతికంగా వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీ దరఖాస్తు రిసిప్ట్ తో పాటు అవసరమైన అన్ని  ఒరిజినల్  తీసుకెళ్లాల్సి ఉంటుంది. 
 
పోలీసుల మీ ఫిజికల్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత, మీకు కొన్ని రోజుల్లో పాస్‌పోర్ట్ లభిస్తుంది. అయితే సాధారణ పద్ధతిలో  పాస్‌పోర్ట్ 30-45 రోజుల్లో జారీ చేస్తారు. కానీ తత్కాల్ పద్ధతిలో అయితే  7-14 రోజుల్లో జారీ అవుతుంది.