రైల్వేస్టేషన్లలో ఫ్రీ Wi-Fi .. ఎలా కనెక్ట్ అవ్వాలంటే..

రైల్వేస్టేషన్లలో ఫ్రీ Wi-Fi .. ఎలా కనెక్ట్ అవ్వాలంటే..

ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగదు.ఇల్లు, ఆఫీసు, సెల్ ఫోన్లు ఇలా అనేక చోట నెట్ వర్క్  ఉండాల్సిందే.. ప్రయాణాల్లో కూడా ఇంటర్నెట్ ను వినియోగించడం ఈ రోజుల్లో కామన్ అయి పోయింది. జెర్నీ టైంలో బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ మెంట్ కోసం కొందరు ఇంటర్నెట్ ఉపయోగిస్తే.. చేయాల్సి టాస్క్ లు మిగిలి ఉంటే వాటికి కంప్లీ్ చేయడం వంటి టైం సద్వినియోగం చేసుకుంటుంటారు మరికొందరు. అయితే అలాంటి వారికోస చాలా ప్రైవైట్, పబ్లిక్ జనం ఎక్కువగా ఉంటే స్థలాల్లో  ఆయా సంస్థల యాజామాన్యం Wi-Fi ఏర్పాటు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కూడా ఇలాంటి సౌకర్యం ఉంది. అయితే ఇప్పుడు భారతీయ రైల్వే స్టేషన్లలో కూడా తమ ప్రయాణికుల కోసం ఉచిత Wi-Fi  సేవలను అందిస్తోంది రైల్వే డిపార్ట్ మెంట్. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..  

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ఈ Wi-Fi అందుబాటులో లేనప్పటికీ ప్రధాన స్టేషన్లలో ఉచిత వైఫై అందించబడుతుంది. ప్రయాణాన్ని మరింత ఎంజాయ్ ఫుల్ గా చేస్తుంది. డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా Google Inc , రైల్ టెల్ , రైల్వే టెలికాం కంపెనీల పరస్పర సహకారంతో Wi-Fi ని అందిస్తోంది. 

  • ALSO READ : పేటీఎంకు టీపీఏపీగా అవకాశం ఇవ్వండి
  • రైల్వే స్టేషన్ Wi-Fi ని ఎలా యాక్సెస్ చేయాలి ..
  • మీ డివైజ్ లో Wi-Fi  సెట్టింగ్ ను ఓపెన్ చేయాలి 
  • నెట్ వర్క్ కోసం సెర్చ్ చేయాలి .. rail wire network ని ఎంచుకోవాలి 
  • బ్రౌజర్ నుంచి Railwire  పోర్టల్ railwire.co.in  ని సందర్శించాలి. 
  • మీ 10 అంకెల మొబైల్ నంబరును ఎంటర్ చేయాలి 
  • OTP వస్తుంది.. wi-Fi కనెక్ట్ చేయడానికి OTPని ఎంటర్ చేయాలి 
  • దీంతో మీరు Railwire  ఉచిత wi-Fi సేవకు కనెక్ట్ అవుతారు.

దేశవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Google వంటి సంస్థలతో కలిసి ప్రజలకు బహిరంగ ప్రదేశాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ను అందించడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

రైల్వే స్టేషన్లలో ఉచిత  wiFi  అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు తమ వెయిటింగ్ టైంను సద్వినియోగం చేసుకుంటారు. వారికి ఇష్టమైన వారితో కాంటాక్ట్ లో ఉండొచ్చు. ఆన్ లైన్ టాస్క్ లను పూర్తి చేయొచ్చు. వెబ్ బ్రౌజ్ ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు.