డ్రాగన్ ఫ్రూట్స్ ను ఎలా కట్ చేసి తినాలి..

డ్రాగన్ ఫ్రూట్స్ ను ఎలా కట్ చేసి తినాలి..

ప్రస్తుతం మార్కెట్ లో డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ నడుస్తుంది. వీటిని చూడగానే అందరికీ వచ్చే డౌట్స్ ఏంటంటే.. ఎలా కట్ చేయాలి.. ఎలా తినాలి అనేది.. చాలా మందికి ఈ విషయం తెలియక వాటిని కొనుగోలు చేయటం మానేస్తున్నారు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సీజన్ నడస్తుండటంతో.. వీటి గురించి సింపుల్ గా తెలుసుకుందాం...

బయట గులాబీ రంగులో కనిపిస్తూ.. లోపల మాత్రం తెల్లని గుజ్జులో చిన్న నల్లని గింజలతో కనిపించే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ను పిటయా, పిటాహయ లేదా స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు. సాధారణ భాషలో సూపర్ ఫ్రూట్ అని పిలుచుకునే ఈ పండును సలాడ్, స్మూతీస్‌లో జోడించవచ్చు లేదా గ్రిల్‌పై కూడా ఉంచవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్‌ను ఎలా కట్ చేయాలి..?

పొలుసులుగా పొడుచుకు వచ్చిన ఆకులతో వెలుపలి భాగం కఠినంగా కనిపిస్తున్నప్పటికీ, దాన్ని ముక్కలు చేయడం మాత్రం చాలా సులువే. దీని చర్మం ఉపరితలం మామిడికాయలాగా సన్నగా, నునుపుగా ఉంటుంది. పైన ఉండే తేలికైన తొక్క గుజ్జు నుంచి సులభంగా వేరు చేయొచ్చు.

సగానికి కత్తిరించండి

కట్టింగ్ బోర్డు మీద డ్రాగన్ ఫ్రూట్ ఉంచి పండును సగానికి పొడవుగా కత్తిరించండి. అందుకు పదునైన చెఫ్ కత్తిని ఉపయోగించండి. పైభాగంలో ప్రారంభించి, ఆపై మందమైన కాండంలోకి వెళ్లేలా కట్ చేయండి. ఆ తర్వాత ఒక చెంచా ఉపయోగించి గుజ్జును సగం నుండి నేరుగా తినవచ్చు.

పై తొక్కను తొలగించండి

ఇది రెండు భాగాలుగా చెయవచ్చు. అవోకాడో మాదిరిగా లోపలి గుజ్జును పెద్ద చెంచాతో తీయవచ్చు. లేదంటే పండు నుంచి మందపాటి చర్మాన్ని తొలగించేందుకు మీ వేళ్లను కూడా ఉపయోగించవచ్చు. నాల్గవ వంతుగా కత్తిరించి ఈ పని చేస్తే తొక్క తీయడం అంత కష్టమేం కాదు.

చిన్న ముక్కలుగా కత్తిరించండి

మీరు డ్రాగన్ ఫ్రూట్‌ను ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. దాన్ని మందపాటి లేదా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు.. ఫాన్సీ ప్రెజెంటేషన్ కోసం.. లేదంటే నారింజ పళ్లగా ముక్కలుగా కట్ చేయవచ్చు. లేదంటే గుండ్రంగా లేదా ఘన పరిమాణాల షేప్ లోనూ కట్ చేయవచ్చు.

గది ఉష్ణోగ్రత వద్ద డ్రాగన్ పండును నిల్వ చేయండి. ఇది పక్వానికి వచ్చినప్పటికీ, మీరు ఆస్వాదించడానికి సిద్ధంగా లేకుంటే, దాన్ని మరో 1 వారం వరకు రిఫ్రిజిరేటర్‌లో మూసివేసిన ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేయండి. ఈ టెక్నిక్ ఇతర ఆహారాల వాసనలు గ్రహించకుండా నిరోధిస్తుంది. లేదంటో ఈ పండును ఆపిల్ లేదా అరటిపండుతో కలిపి ఓ కాగితపు సంచిలో ఉంచవచ్చు. ఆ పండ్ల నుంచి వెలువడే ఇథిలిన్ వాయువు పక్వాన్ని వేగవంతం చేస్తుంది. కత్తిరించిన ముక్కల కోసం, గాలి చొరబడని కంటైనర్‌లో 2 నుంచి 5 రోజులు నిల్వ చేయండి, కానీ పైన తొక్క గోధుమ లేదా మెత్తగా మారినప్పుడు మాత్రం తీసివేయండి.