కరోనా మించిన విపత్తు రాబోతుందా..? : ఎదుర్కోవటానికి చిట్కాలు చెబుతున్న శాస్త్రవేత్తలు

కరోనా మించిన విపత్తు రాబోతుందా..? : ఎదుర్కోవటానికి చిట్కాలు చెబుతున్న శాస్త్రవేత్తలు

కరోనా అంతరించిపోయిందని సంతోషిస్తున్న సమయంలో ప్రపంచానికి డిసీజ్ ఎక్స్ ముప్పు ఉందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై డబ్ల్యూహెచ్వో సైతం స్పందించింది. అదంతా ఊహాజనితమేనని, కానీ సంసిద్ధత కూడా అవసరమేనని  చెప్పింది. కరోనా తరహాలో డిసీజ్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభానం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ పోర్స్ కు నాయకత్వం వహిస్తోన్న డేమ్ కేట్ బింగ్ హామ్ చెప్పినట్టు ఇటీవల బ్రిటన్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కరోనా కంటే 7రెట్ల అధిక ప్రభావం చూపిస్తుందని వెల్లడించాయి.

దీన్ని ఎదుర్కునేందుకు ముఖ్యంగా చతుర్ముఖ వ్యాహాలను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో..

  • జన్యుసంబంధమైన నిఘా విస్తరణపై దృష్టి సారించడం.
  • వ్యాధికారక జాబితాను రూపొందించండం.
  • కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి సమయంలో చేసిన విధంగా, అవసరమైతే, భారతదేశం సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాక్సిన్‌లను సిద్ధం చేయగల సామర్థ్యం పెంపొందించుకోవటం.
  • సమర్థవంతమైన ఔషధాలను, ముఖ్యంగా యాంటీవైరల్‌లను కనుగొనే పనిని కొనసాగించడం.

ఇందులో భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తదుపరి మహమ్మారి లేదా వ్యాధి Xకి వ్యతిరేకంగా సిద్ధం కావడం ప్రారంభించాయి.