
ఎప్పుడూ అందంగాకనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ మధ్య మహిళలతో పాటు పురుషుల్లో కూడా బ్యూటీ కాన్షియస్ పెరిగింది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మగవాళ్లలో కొన్ని స్కిన్, హెయిర్ సమస్యలు ఎప్పుడూ బాధిస్తుంటాయి. అందులో మరీ ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిల్లో మొటిమల సమస్య విపరీతంగా ఉంటుంది. దానికోసం స్పెషల్ ట్రీట్ మెంట్ ఏమీలేకుండా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు.
ఎక్కువగా ఎండలో, దుమ్ము, ధూళిలో తిరగడం. చర్మగ్రంథులోని నూనె గ్రంథుల నుంచి ఎక్కువగా సెలమ్ విడుదలవ్వడం వల్ల మొటిమలు పెరుగుతాయి. అంతేకాదు. మొండిగా మార్ని ఈ మొటిమలు ముఖం, మెడ, చేతులు, భుజాల మీద కూడా వస్తాయి. ఈ మొటిమలను నివారించుకోవడం కోసం డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్లడం లేదా. ఖరీదైన కాస్మోటిక్స్ వాడేందుకు ముందు ఈ సింపుల్ హోంమేడ్ ట్రీట్ మెంటిని ట్రై చేయండి.
టూత్ పేస్ట్:
టూత్ పేస్టు మొటిమలపై అప్లై చేయడం వల్ల ఈ సమస్య త్వరగా తగ్గుతుంది. అయితే టూత్ పేస్ట్ ను మొటిమలకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి తేమలేకుండా తుడవాలి. మొటిమల మీద అప్లై చేయడానికి కేవలం తెల్లటి టూత్ పేస్ట్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఉన్న పేస్ట్ వాడొద్దు. కాటన్ బాల్కు కొద్దిగా పేస్డ్ రాసి, తర్వాత వేరుగా మొటివుల మీద మాత్రమే అప్లై చేయాలి. రాత్రివేళ అప్లై చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలా కుదరకపోతే పగటి పూట ఆపై చేసి పదిహేను నిమిషాలయ్యాక కడుక్కోవాలి, వారంలో రెండు, మూడుసార్లు ఇలా టూత్ పేస్ట్ టిప్ని వాడితే నుంచి ఫలితం ఉంటుంది.
ఎగ్ వైట్:
గుడ్డు తెల్లసొన మొటిమల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, అమైనో యాసిడ్స్, ప్రొటీన్స్ మొటిమల మీద ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. మరి ఎగ్ వైట్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత తడి లేకుండా లవల్ తో తుడవాలి. ఆపైన గుడ్డులోని తెల్ల సొనను మొటిమల మీద అప్లై చేయాలి. ఐదు నిమిషాల తర్వాత మరో కోట్ లాగా అప్లై చేసి, పూర్తిగా ఆరాక ముఖాన్ని చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.
వెల్లుల్లి :
మొటిమలు వస్తుంటాయి. పోతుంటాయి.. కానీ మచ్చలు మిగిలిపోతాయి. ఈ మచ్చలను తొలగించడానికి అద్భుతమైన రెమెడీ వెల్లుల్లి ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ రక్త ప్రసరణ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. వెల్లుల్లిని నేరుగా మొటిమల మీద అప్లై చేయడం వల్ల మొటిమల మీద మంట కలుగుతుంది. అందునల్ల దీనికి కొద్దిగా నీళ్లు కలపాలి. వెల్లుల్లి పాయల పొట్టు తీసి పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఐస్:
మొటిమలను నివారించడంలో ఐస్ బాగా పని చేస్తుంది. ఇది మొటిమల సైజు, నొప్పి, వాపును తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. బిప్ చల్లగా ఉండటం వల్ల మొటిమల మీద త్వరగా రియాక్ట్ అవుతుంది, కొద్ది రోజులకి మొటిమలు మాయమవుతాయి. ముందుగా చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్లో రెండు, మూడు ఐస్ క్యూబ్స్ పెట్టి చుట్టాలి. దాన్ని ముఖం మీద గట్టిగా రుద్దకుండా, కొంచెం టైమ్ గ్యాప్ ఇస్తూ... ఇలా రెగ్యులర్ చేస్తే మొటిమలతో ఏర్పడి వాపులు, ఎరుపు రంగు, నొప్పి తగ్గుతాయి.
తేనె:
తేనెలో నేచురల్ మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. అవి పురుషుల్లో మొటిమలను నివారిస్తాయి. తేనెలో కాటన్ బాల్ని ముంచి మొటిమలు, మచ్చలపై అప్లై చేయాలి. అరగంట తర్వాత వేడి నీళ్లతో ముఖాన్ని కడుగాలి.
యాపిల్ సైడర్ వెనిగర్:
మగవాళ్లలో మొటిమల నివారణకు యాపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ కొనేటప్పుడు స్వచ్ఛమైనది, కెమికల్స్ కలవనిది ఎంపిక చేసుకోవాలి. చిన్న బౌల్లో ఒకటి స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, మూడు టీ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. అందులో కాటన్ బాల్ విడిప్ చేసి మొండి మొటిమల మీద పెట్టి వదిలేయాలి. కాటన్ డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ లేదా యాంటీ పింపుల్ క్రీమ్ అప్లై చేయాలి.
గ్రీన్ టీ:
మగవాళ్లలో మొండిగా మారిన మొటిమలు మీద గ్రీన్ టీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో ఎన్నోరకాల ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఒక కప్పు గ్రీన్ టీ తయారు చేసి చల్లార్చాలి. తర్వాత వేడినీళ్లలో ముంచిన బ్యాగ్ ను మొటిమల మీద అప్లై చేయాలి. అలా నిమిషం పాటు అద్దుతూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత తడి కాత్తో ముఖాన్ని తుడవాలి. ఇలా రెగ్యులర్ చేస్తూ ఉంటే మొటిమల సమస్య తగ్గుతుంది.!
బొప్పాయి:
బొప్పాయి పండు ముఖంపై ఉండే ఎక్సట్రా ఆయిల్స్ ని తగ్గిస్తుంది. అలాగే స్కిన్ లేయర్ తొలగిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలున్న బొప్పాయి. అంతేకాదు మొటిమల వల్ల కలిగే మచ్చలు కూడా తొలగిస్తుంది. బొప్పాయి ముక్కలను మెత్తగా ఫేస్ట్ చేయాలి. దాన్ని మొటివుల మీద నేరుగా చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తుంటే మంచి ఫలితం.