
పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానానికి గడువు మార్చి 31తో ముగియనుంది. మీ పాన్ నంబర్-, ఆధార్ నంబర్‌తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 తర్వాత ఇక చెల్లుబాటు కాదు. కాబట్టి వెంటనే పాన్-, ఆధార్ లింక్ చేయండి. ఒకవేళ పాన్, ఆధార్ లింక్ అయిందో లేదో ఈ కింద లింకులోకి వెళ్లి చెక్ చేసుకొండి.
పాన్ ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా https://www.incometax.gov.in అనే ఈ వెబ్‌సైట్ లోకి వెళ్లండి. ఆ తరువాత ఎడమ వైపు క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో మీ పాన్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి నంబర్లు ఎంటర్ చేసిన తర్వాత స్మబిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పాన్-ఆధార్ లింక్ అయిందో లేదో మీకో అలర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ పాన్-ఆధార్ లింక్ కానట్లయితే మార్చి 31లోపు రూ.1000 చెల్లించి లింక్ చేయాలి. లింక్ చేయాని పాన్ కార్డులు ఏప్రిల్ 1, 2023 నుంచి పని చేయకుండా పోతాయి. ఒక వేళ గడువులోపు పూర్తి చేయకుంటే మీ పాన్ కార్డు ఎలాంటి లావాదేవీలకు పనికి రాదు.