Organic Holi Colours : పూల రంగులతో హోలీ సంబురం.. ఇంట్లోనే రంగుల తయారీ ఇలా..

Organic Holi Colours : పూల రంగులతో హోలీ సంబురం.. ఇంట్లోనే రంగుల తయారీ ఇలా..

హోలీ సంబురం వచ్చేసింది. ఈ రంగులకేళిలో రసాయన రంగుల్ని వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు... కాదంటూ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే కృత్రిమ రంగులతో పోలిస్తే ఆర్గానిక్ కలర్ పౌడర్లకే మార్కెట్లో రేటు ఎక్కువ. పైగా అవి నిజంగా అర్థానిక్వేనా అనేది మనకు తెలీదు. కాబట్టి కొంచెం కష్టపడితే ఇంట్లోనే ఎవరికి వాళ్లు సహజరంగుల్ని తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....

ఆయుర్వేదంలో హోలీ

హోలీ వెనుక పురాణకథనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలోనూ ఈ పండుగ గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. చలి కాలం వెళ్లిపోయి... వేసవి వచ్చేప్పుడు గాలిమార్పు కారణంగా జ్వరాలు, జలుబూ వచ్చే అవకాశం ఎక్కువ. అవేమీ రాకుండా ఉండేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడులను నీళ్లలో కలిపి చల్లుకునేందు కే ఈ వేడుక పుట్టిందని చెప్తారు. ముఖ్యంగా మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరిస్తే, హోలీ పండుగ పూట చలువచేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరి చేరవని అంటారు.

ఎల్లో/ పసుపు

ఈ రంగును తయారు చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని, బంతి పువ్వులు (యాభై గ్రాములు), నారింజ తొక్కల పొడి (ఇరవై గ్రాములు), చేమగడ్డ పొడి (రెండొందల గ్రాములు), పసుపు వంద గ్రాములు), నిమ్మ రసం (ఇరవై చుక్కలు). ఈ మొ త్తాన్ని ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే మెత్తని పసుపు రంగు తయారవుతుంది.

రెడ్ /ఎరుపు

మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన ఆ పువ్వులను మెత్తని పొడిగా నూరుకోవాలి. అంతే.. ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే ఈ మిశ్రమానికి కొంచెం బియ్యప్పిండి కలిపితే సరిపోతుంది. మందారంతోపాటు ఎర్ర చందనం పౌడర్ తో కూడా రెడ్ కలర్ను తయారుచేసుకోవచ్చు. పైగా ఎర్ర చందనం శరీరానికి మంచి రంగును ఇస్తుంది. దీనిని తడి, పొడి రంగుగా వాడుకోవచ్చు. లీటర్ నీటిలో రెండు చెంచాల ఎర్ర చందనం పౌదరిని కలిపి దగ్గరికి అయ్యేదాకా మరగనివ్వాలి. చల్లారాక కొన్ని నీళ్లు కలిపితే తడి రంగు తయారవుతుంది.

బ్రౌన్/గోధుమ

గోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్ర మాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్య ప్పిండిని కలిపితే చాలు.

బ్లూ/నీలం

సూర్యకాంతిలో ఇసుక నేలల్లో ఎక్కువగా పెరిగే చెట్లు జకరండ (నీలి గుల్మహార్), వీటి పువ్వులు నీలి, ఊదా రంగుల్లో ఉంటాయి. వీటిని ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. కేరళ ప్రాంతంలో అయితే నీలి మందారం మొక్కల నుంచి సహజసిద్ధమైన రంగుల్ని తయారుచే స్తారు. తడి రంగు కోసం నీలిమందు చెట్ల కాయల్ని ( జెర్రీలు) పొడి చేసి నీళ్లలో కలపాలి. కొన్ని జాతుల నీలిమందు చెట్ల ఆకులు కూడా నీలం రంగుల్లోనే ఉంటాయి. వాటిని కూడా నీటితో కలిపి బ్లూ రంగు తయారుచేసుకోవచ్చు.

గ్రీన్ ఆకుపచ్చ

గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్య కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మీ శ్రమంగా చేయాలి. పై పై నీటిని వడబోసి మిగిలిన నీటిని తడి ఆకుపచ్చ రంగుగా వాడుకోవచ్చు.

ఆరెంజ్/కాషాయం

మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెట్టినా సరిపోతుంది. పసుపు కాషాయం రంగుల మిశ్రమంతో రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. మైదాకును నీటిలో కలిపి ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికల్లా కాషాయం రంగు తయారవుతుంది. కాకపోతే ఇది కాస్టీ వ్యవహారం.

పింక్/గులాబీ

పసుపు రంగు మందార పువ్వులు, బీట్ రూట్ ద్వారా అర్ధానికి పింక్ రంగును తయారు చేయొచ్చు. బీట్ రూ టీను పేస్ట్ గా నూరి.. ఆ మిశ్రమాన్ని ఎండలో నానబెట్టాలి. ఎక్కువ పరిమాణంలో కావాలనుకుంటే ఆ పొడికి కొంచెం శెనగలేదా గోధుమ పిండిని కలపాలి. తడి రంగు కోసం బీట్రూట్ ముక్కలను నీటిలో మరగబెట్టి.. చల్లార్చాలి.