వీకెండ్​ వర్కవుట్స్​.. ఎలా ఉంటే మంచిది?

వీకెండ్​ వర్కవుట్స్​.. ఎలా ఉంటే మంచిది?

వారంలో ఒక్కసారైనా  వర్కౌట్​ చేంజ్​ ఉండాలి అంటున్నారు ఫిట్​నెస్​ నిపుణులు.  రెగ్యులర్​ జిమ్​ లో చిన్న మార్పులు చేయడం వల్ల ఫిజికల్, మెంటల్​ హ్యాపీనెస్​ను, పైగా వర్కవుట్స్​​ మీద ఆసక్తిని పెంచుతుందని చెబుతున్నారు. మామూలుగా అయితే  వారానికి మూడు గంటల నుంచి ఆరు వరకూ  వర్కవుట్స్​​ చేయాలి.  మొదట  కేవలం  30 నిమిషాల వర్కవుట్​​ సరిపోతుంది.  రోజులు పెరిగే కొద్దీ ఆ టైం  పెంచాలి. వారంలో ఒక్కసారి రిలాక్స్​డ్ వర్కవుట్లు అవసరం.  

అవుట్​ డోర్​​ : వారంలో ఒక్కసారైనా జిమ్​ నుంచి బ్రేక్​ తీసుకోవాలి.   జిమ్​ నుంచి బ్రేక్​ అంటే వర్కవుట్స్​​కి బ్రేక్​ కాదు.  వీకెండ్​లో హైకింగ్​, రాక్​ క్లైంబింగ్​, వాటర్​ బెలూన్​ బ్యాటిల్​ వంటి అడ్వెంచర్​  వర్కవుట్లు ప్లాన్​ చేసుకోవచ్చు. 

డాన్స్​ క్లాస్​ :   హెవీ వర్కవుట్లు చేసి శరీరాన్ని ఎంత షేప్​ చేసినా... మెదడుకు రిలాక్సేషన్​ కావాలి. అలా కావాలంటే యోగా, డాన్స్​, సంగీతం వంటివి చక్కని మార్గాలు. వారంలో ఒక్కసారైనా వీటిని ట్రై చేస్తే  జిమ్​ టైంను బ్యాలెన్స్​ చేసినట్టు అవుతుంది. మనసుకు  పీస్​ఫుల్​ ఎక్సర్​సైజ్​ అవుతుంది. 

బ్యాలెన్సింగ్​ యోగా  :  వర్కవుట్స్​లో యోగా భాగమైనప్పటికీ  కొన్ని యోగాసనాలు శరీరాన్ని స్ట్రాంగ్​గా తయారుచేస్తాయి. చేతుల మీద పూర్తి శరీరాన్ని బ్యాలెన్స్​ చేయడం ( ఆర్మ్​ బ్యాలెన్స్​) వంటివి శరీరాన్ని ఫిట్​గా ఉంచుతాయి. 

వాక్​  ఆన్​ స్టెప్స్​​ :   మెట్లు ఎక్కుతూ, దిగడం పాత స్టైల్​ అనిపించొచ్చు. కానీ ఇది  చాలా మంచిది.  వారం​లో  ఒక్కసారైనా మెట్ల మీద నడవడం అలవాటు చేసుకోవాలి. 
గేమ్స్​ :   వీకెండ్​లో టైం దొరికినప్పుడల్లా పిల్లలతో గేమ్స్​ ఆడటం, బైక్​ రైడింగ్​ చేయడం, చుట్టుపక్కల ప్రాంతాలను, గదులను  శుభ్రం చేయడం ఇవన్నీ వీకెండ్​ వర్కవుట్స్​​లో భాగంగా చేసుకోవచ్చు.