హోంలోన్​ వడ్డీలు పెరిగినా.. కిస్తీల భారం తగ్గించడం ఇలా...

హోంలోన్​ వడ్డీలు పెరిగినా.. కిస్తీల భారం తగ్గించడం ఇలా...

బిజినెస్​ డెస్, వెలుగు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి చేర్చింది. ఇది కమర్షియల్​ బ్యాంకులకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిఐ లోన్స్​ ఇచ్చే రేటు. దీనివల్ల బ్యాంకులు ఆర్​బీఐ నుంచి తీసుకునే లోన్లపై రిజర్వ్ బ్యాంక్‌‌కు మరింత ఎక్కువ వడ్డీని చెల్లించాలి. ఫలితంగా బ్యాంకుల కస్టమర్లకు హోం లోన్లతో సహా, వివిధ లోన్లకు మరింత వడ్డీ చెల్లించాలి. అంటే.. కస్టమర్లు నెలవారీగా చెల్లించే కిస్తీలు (ఈఎంఐలు) పెరుగుతాయి. హోం లోన్స్​ను ఫిక్స్​డ్​  లేదా  ఫ్లోటింగ్ ​రీపేమెంట్​ విధానాల్లో చెల్లిస్తారు. 

కస్టమర్ తన అవసరాలకు తగ్గట్టు గడువును (టెనార్​)ను ఎంచుకుంటాడు. రెపోరేటు పెరగడం వల్ల  హోం లోన్లపై వడ్డీ రేటు పెరగడం తప్పదని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. బారోవర్లు పెరిగిన వడ్డీ రేటుకు అనుగుణంగా ఈఎంఐ భారాన్ని మోయాలి లేదా  లోన్​ కాల పరిమితిని పెంచాలని బ్యాంకును అడగాలి.  కస్టమర్లు తమ ఈఎంఐల భారాన్ని తగ్గించుకోవడానికి కింద పేర్కొన్న పద్ధతులను ప్రయత్నించవచ్చు.  

1. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాఫ్ట్ సదుపాయంతో హోం లోన్: 

ఇటువంటి ఈఎంఐలపై వడ్డీ రేటు 0.50 శాతం నుంచి 0.75శాతం వరకు  ఎక్కువగా ఉన్నప్పటికీ, వడ్డీని ఆదా చేయడానికి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్ ఖాతాలో కస్టమర్ అదనపు నిధులను ఉంచవచ్చు. పొదుపు ఖాతా రేట్ల కంటే హోమ్ లోన్ రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిస్తీ భారం పెరిగినా ఈ డబ్బు ఆదుకుంటుంది.

2. వడ్డీ రేటును పరిశీలిస్తూ ఉండండి:

వడ్డీ రేటు ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ఇది తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని అంచనా. హోమ్ లోన్ కస్టమర్లు వడ్డీ రేట్లను తరచూ చెక్​ చేస్తుండాలి. కస్టమర్​కు ఏదైనా తగ్గింపు ఇస్తున్నదీ లేనిదీ అడగాలి. మార్కెట్ రేట్ల ప్రకారమే వసూలు చేస్తున్నారని నిర్ధారించుకోవాలి. అంతేకాదు ఇన్సెంటివ్స్, బోనస్ వంటివి లేదా మిగులు నగదు నుంచి ఏదైనా అకస్మాత్తుగా భారీ లాభాలు వస్తే లోన్  ఈఎంఐ తగ్గింపు కోసం వాడాలి. అంటే ఆ డబ్బుతో కొంత మొత్తాన్ని కట్టాలి. 

4. రీ-నెగోషియేషన్,  రీ-ఫైనాన్సింగ్ స్ట్రాటజీ: 

హౌసింగ్ లోన్లపై ఆఫర్లను,  వడ్డీ రేట్లను తప్పక చూడాలి. ఒకవేళ తేడా ఎక్కువ ఉంటే కస్టమర్లు తను లోన్​ తీసుకున్న బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మళ్లీ చర్చలు జరపాలి. ఇక్కడ ఆఫర్లు బాగా లేకుంటే, కస్టమర్ రీఫైనాన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఎంచుకోవచ్చు.

5. ఎక్కువ కిస్తీలు ఉత్తమం: 

కిస్తీల సంఖ్య ఎక్కువ ఉంటే నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది. వయస్సు ప్రకారం గరిష్ట లోన్​ గడువును ఎంచుకోవడం మంచిది. 15-–20 సంవత్సరాల ఈఎంఐ కంటే 25-–30 సంవత్సరాల ఈఎంఐ మంచిది. మిగులు డబ్బు ఉంటే ముందస్తుగా చెల్లించే అవకాశం కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎల్లప్పుడూ ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..బ్యాంక్​ నుంచి మంచి వడ్డీ రేటును పొందాలంటే తప్పకుండా బెస్ట్​ క్రెడిట్​స్కోర్​ బాగుండాలి. ఇది బాగుండాలంటే అన్ని లోన్స్,​  క్రెడిట్ కార్డ్ బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించాలి.