వాట్సాప్ ను సెక్యూర్ గా ఉంచడం ఎలా?

వాట్సాప్ ను సెక్యూర్ గా ఉంచడం ఎలా?

దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మందికి పైగా రోజూ వాట్సాప్​ వాడుతున్నారు. అయితే వాట్సాప్​లో ఫేక్​ న్యూస్, ప్రైవసీ వంటి సమస్యలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వాటికి చెక్​ పెట్టేందుకు వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకొస్తోంది. ప్రైవసీ ఫీచర్స్​ యాడ్​ చేస్తూ వస్తోంది. మీరూ ఈ ప్రైవసీ సెట్టింగ్స్​ సెట్​ చేసుకుంటే మీ వాట్సాప్​ డేటాను కొంతవరకు సెక్యూర్​గా ఉంచుకోవచ్చు.

వాట్సాప్​లో ‘టు స్టెప్​ వెరిఫికేషన్’​ ఫీచర్​ ఉంది. ఇది మీ అకౌంట్​ సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఇతరులు మీ వాట్సాప్​ను యాక్సెస్​ చేసే వీలుంది. ముఖ్యంగా మీకు దగ్గరగా ఉండే సన్నిహితులే మీకు తెలియకుండా వాట్సాప్​ చూడొచ్చు. ఇతరులు మీ వాట్సాప్​ సమాచారం తెలుసుకోవాలనుకుంటే వాళ్ల ఫోన్​వాట్సాప్​లో మీ మొబైల్​ నంబర్​ ఎంటర్​ చేస్తే మీ నంబర్​కు ఓటీపీ వస్తుంది. మీరు మొబైల్​ పక్కన లేని సమయంలో ఓటీపీ తెలుసుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇలా చేసి, మీ వాట్సాప్​ అకౌంట్​ను వాళ్లు యాక్సెస్​ చేస్తారు.

దీంతో మీ చాటింగ్​ సమాచారం అంతా తెలుసుకోగలుగుతారు. దీనికి చెక్ పెట్టాలంటే ‘టు స్టెప్​ వెరిఫికేషన్’ సెట్​ చేసుకోవాలి. అంటే సిక్స్​ డిజిట్​ పిన్​ సెట్​ చేసుకోవాలి. దీనివల్ల వాట్సాప్​ను యాక్సెస్​ చేయాలంటే ఓటీపీతోపాటు, పిన్​ కూడా అవసరం. ఇది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి, ఇతరులు అంత సులభంగా కనిపెట్టలేరు. దీనికోసం ‘వాట్సాప్’లో సెట్టింగ్స్​లోకి వెళ్లి, అకౌంట్> టు స్టెప్​ వెరిఫికేషన్ > ఎనేబుల్’ చేసుకోవాలి. అప్పుడు సిక్స్​ డిజిట్​ పిన్​సెట్​ చేసుకుని, ఈ–మెయిల్​ ఐడీ ఎంటర్​ చేయాలి. అంతే ‘టు స్టెప్​ వెరిఫికేషన్ పిన్’ సెట్​ అయినట్లే.

ఫేస్​బుక్​లోలాగా ప్రొఫైల్​ ఫొటోను ఎవరూ సేవ్​ చేసుకోవడం లేదా స్క్రీన్ షాట్​ తీసుకోకుండా చేసే స్క్రీన్​గార్డ్​ ఫీచర్​వాట్సాప్​లో లేదు. దీంతో ఎవరైనా ప్రొఫైల్​ పిక్చర్​ను సేవ్ చేసుకోవడమో, స్క్రీన్​ షాట్​తీసుకోవడమో చేయొచ్చు. దీన్ని పూర్తిగా ఆపలేకపోయినా, కాంటాక్ట్​లో ఉన్న వాళ్లకు మాత్రమే ప్రొఫైల్​ఫొటో కనిపించేలా చేయొచ్చు. ఇందుకు సెట్టింగ్స్​లోకి వెళ్లి> ప్రైవసీ> ప్రొఫైల్​ఫొటోస్​ క్లిక్​చేస్తే ‘ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడీ’ అనే ఆప్షన్స్​ కనిపిస్తాయి. మీ ప్రొఫైల్​ ఫొటో ఎవరికీ కనిపించకూడదు అనుకుంటే ‘నోబడీ’, మీ కాంటాక్ట్స్​లో వాళ్లకు మాత్రమే కనిపించాలంటే ‘మై కాంటాక్ట్స్’ సెలెక్ట్​ చేసుకోండి.  ఒకవేళ మీ ఫోన్​ పోతే వేరేవాళ్లు వాట్సాప్​ వాడకుండా ఉండాలంటే వాట్సాప్​ సపోర్ట్ కు ‘లాస్ట్/స్టోలెన్​: ప్లీజ్​ డీ యాక్టివేట్​ మై అకౌంట్’ మెయిల్​ చేయాలి.ఇంటర్నేషనల్​ ఫార్మాట్​లో మీ ఫోన్​ నెంబర్​ పంపించాలి. వెంటనే వాట్సాప్​ అకౌంట్​ డీ యాక్టివేట్​ అవుతుంది.