
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ను తగ్గించే పనిలో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా - NHAI పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వాహనదారులు తమ ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను జనవరి 31లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే ఆ తర్వాత సదరు ఫాస్టాగ్ అకౌంట్ బ్లాక్ అవుతుందని పేర్కొంది. ఫాస్టాగ్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే అకౌంట్ బ్లాక్ చేస్తామని నేషనల్ హైవేస్ తెలిపింది. అయితే మరో 3 రోజుల్లో ఈ గడువు ముగియనుంది. కావున ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు ఈ కింది దశల ద్వారా తెలుసుకుందాం.
ఎలా అప్ డేట్ చేయాలంటే..
- బ్యాంక్-లింక్ చేయబడి ఉన్న ఫాస్టాగ్ (Fastag) వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి. ఆ తర్వాత OTPని నమోదు చేయండి.
- My Profile సెక్షన్ కు వెళ్లి KYC ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన వివరాలను పూరించిన తర్వాత, submit బటన్‌ను క్లిక్ చేయండి.
- ఈ విధంగా, KYC పూర్తవుతుంది. ఆ తర్వాత KYC పేజీ మీ KYC స్టేటస్ ను చూపుతుంది.
ఫాస్టాగ్ స్టేటస్ ను ఎలా చెక్ చేయలి?
- మీరు fastag.ihmcl.comని సందర్శించడం ద్వారా ఫాస్టాగ్ స్టేటస్ ను చెక్ చేయవచ్చు.
- వెబ్ పేజీ ఓపెన్ కాగానే మీరు వెబ్‌సైట్ కుడి ఎగువ భాగంలోని ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ చేయడానికి, మీరు OTP కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను టైప్ చేయాలి.
- లాగిన్ అయిన తర్వాత, డ్యాష్‌బోర్డ్‌లోని మై ప్రొఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేయాల.
- మై ప్రొఫైల్ సెక్షన్ లో, మీరు మీ FASTag KYC స్టేటస్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో సమర్పించిన ప్రొఫైల్ వివరాలను కూడా చూడవచ్చు.
FASTag KYC కోసం అవసరమయ్యే పత్రాలు
- వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- గుర్తింపు కార్డు
- అడ్రస్ ప్రూఫ్
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- ముఖ్యంగా, ID, చిరునామా కోసం పాస్‌పోర్ట్, ఓటరు ID కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు ఉపయోగించవచ్చు.