Good Health : మెంతులతో మేలైన మంచి ఆరోగ్యం ఇలా..

Good Health : మెంతులతో మేలైన మంచి ఆరోగ్యం ఇలా..

హెల్దీ లైఫ్ కోసం ఎన్నోరకాల ఫుడ్ ఐటమ్స్, టిప్స్ ని ఫాలో అవుతారు. వాటిలో ఒకటి మెంతులు. మెంతుల వల్ల శరీరానికి కలిగే ఎన్నో రకాల ప్రయోజనాల గురించి తెలిస్తే వీటిని వదిలిపెట్టరు. 

* ప్రాచీన కాలం నుంచి చాలా రకాల వ్యాధులకు మెంతులను మెడిసిన్గా వాడుతున్నారు. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్, బ్లడ్ ప్రెజర్, యూరిక్ యాసిడ్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తాయి, హెయిర్ ఫాల్ ని తగ్గిస్తాయి. బాడీలోని గ్లూకోజ్ టాలరెన్స్ ని పెరిగేలా చేస్తాయి. 

• మెంతులు ఆకలిని, డైజెషన్ పవర్ ని పెంచుతాయి. ఇవి డయాబెటిస్, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తాయి. నెరసిన జుట్టు, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు వీటిని రోజూ ఫుడ్తో తీసుకోవడం మంచిది. ఇవి బ్లడ్ని డీటాక్సిఫై చేసి బ్లడ్ లెవల్స్న పెంచుతాయి. న్యూరాల్జియా, పెరాలసిస్, మలబద్ధకం, కడుపులో నొప్పి, ఉబ్బరంగా ఉండటం, నడుమునొప్పి, కీళ్ల నొప్పులకు మెంతులు వాడితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మెంతుల వల్ల దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్, ఒబెసిటీ బారిన పడకుండా ఉండొచ్చు. 

ఇలా తీసుకోవాలి.. 

• ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే వాటిని తినాలి. లేదా ఆ వాటర్ని టీ లాగా తాగినా యూజ్ ఉంటుంది. 

• ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడిని భోజనానికి ముందు, రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లలో లేదా పాలలో కలుపుకొని తాగాలి. 

• రోజ్ వాటర్లో మెంతి పొడిని కలిపి ముఖానికి రాయడం వల్ల డార్క్ సర్కిల్స్, పింపుల్స్, మచ్చలు, ముడతలు పోతాయి. 

• జుట్టు రాలడం, చుండ్రు, నెరసిన జుట్టుకు మెంతుల పేస్ట్లో పెరుగు, అలోవెరా జెల్ లేదా నీళ్లు కలిపి పెట్టుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది.