- మేడారం ఫారెస్ట్‌లో సెంట్రర్టీమ్ విజిట్
- ఫారెస్ట్ లో ప్రకృతి భీభత్సంతో విరిగిన చెట్లపై ఆరా..
ములుగు: మేడారం ఫారెస్ట్‌లో చెట్లు ఎలా విరిగాయి..? ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది. ప్రకృతి బీభత్సం సృష్టించడానికి కారణాలు ఏంటీ..? ఇలా పలు సందేహ లపై సెంట్రల్ టీమ్ ఆరా తీస్తుంది.
ప్రకృతి బీభత్సంతో ఇటీవల మేడారం -తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో భారీ వృక్షాలు నేలకూలాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ, నేషనల్రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల ఆఫీసర్లు శుక్రవారం (సెప్టెంబర్5) ఫారెస్ట్‌ను విజిట్ చేసింది. మొత్తం పది టీమ్‌లతో అటవీశాఖ విచారణ చేస్తుంది. ప్రకృతి బీభత్సానికి కారణాలను ఆఫీసర్ల టీమ్ క్షుణ్ణ్నంగా తెలుసుకుంటున్నారు.
మెట్రెలాజికల్, శాటిలైట్ డేటా ఆధారంగా ఆ రోజు ఏం జరిగిందనే ఆధారాలను ఫారెస్ట్టెక్నికల్ టీమ్ సేకరిస్తుంది. మేడారం అడగుల్లో 204 హెక్టార్లలో 70 వేలకు పైగా భారీ వృక్షాలు నేలమట్టం అయిన్నట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. ఫారెస్ట్‌లో పెద్ద ఎత్తున్న గాలి దుమారం, సుడి గాలుల బీభత్సంతో 50 నుంచి 60 మహావృక్షాలు వేర్లతో సహా కుప్పకూలాయని పేర్కొన్నారు.
ALSO READ | ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ..అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు
ఫారెస్ట్ లో ఎక్కువగా టేకు, నల్లమద్ది, జిట్రేగి, బూరుగు, నల్లమద్ది, ఎర్రమద్ది, బొజ్జ, మారేడు, తెల్లమద్ది, నేరేడు లాంటి విలువైన వృక్షాలు నేలమట్టం అయిన్నట్లుగా ఆఫీసర్లు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలను ఇంకా పరిశోధనాత్మకంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.