
- 26 మందికి వైరస్.. ప్లాంట్ మూసివేత
అహ్మదాబాద్: ఫార్మా కంపెనీలో కరోనా కలకలం రేపుతోంది. దేశంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటైన గుజరాత్ అహ్మదాబాద్ లోని క్యాడిలా ఫార్మాస్యుటికల్స్ కంపెనీలో 26 మందికి కరోనా సోకింది. దీంతో కంపెనీని మూసివేసినట్లు మేనేజ్మెంట్ ప్రకటించింది. ఆరు రోజుల కిందట ఐదుగురికి కరోనా కన్ఫామ్ అయింది. వారితో కాంటాక్టు అయిన 30 మంది సిబ్బందికి గురువారం టెస్టులు నిర్వహించగా 21 మందికి వైరస్ సోకినట్లు తేలిందని అహ్మదాబాద్ జిల్లా డెవలప్ మెంట్ ఆఫీసర్ అరుణ్ మహేశ్ బాబు మీడియాకు వెల్లడించారు. ఈ ప్లాంట్‌ను మూసివేయాలని గురువారం ఆదేశించామని, 95 మంది ఉద్యోగులను క్వారంటైన్ కి తరలించి.. ప్లాంట్లో శానిటైజేషన్ పనులు చేపట్టామని తెలిపారు.