హెటిరో డైరెక్టర్లు, సీఈఓల ఇళ్ళలో భారీగా నగదు స్వాధీనం

V6 Velugu Posted on Oct 08, 2021

హైదరాబాద్: హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబుల్లో మూడో రోజు ఇన్‎కం ట్యాక్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.  సనత్ నగర్‎లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్   ప్రధాన కార్యాలయం నుంచి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్ళిపోయిన అధికారులు.. ఉదయం 8 గంటలకు తిరిగి వచ్చారు. అనంతరం హెటిరో డైరెక్టర్లు, సీఈఓల ఇళ్ళలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ నగదు ఇంట్లో ఎందుకు పెట్టారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నగదును ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దాని గురించి వివరాలు సేకరిస్తున్నారు. కంపెనీ లావాదేవీలకు సంబంధించిన డబ్బులా.. లేకపోతే  బయట ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా? అనే దానిపై ఐటీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.

For More News..

మహిళల ఐక్యతకు చిరునామాగా బతుకమ్మ నిలుస్తుంది: తమిళిసై

వర్షాలతో రూ. 8 వేల కోట్ల పంట నష్టం వస్తే.. కేంద్రం రూ. 8 కూడా ఇవ్వలే

కౌలు రైతులను మేం పట్టించుకోం: సీఎం కేసీఆర్

పండుగపూట పెట్రో మంట.. వరుసగా నాలుగో రోజు బాదుడు

 

Tagged Hyderabad, Telangana, IT raids, hetero drugs

Latest Videos

Subscribe Now

More News