మహిళల ఐక్యతకు చిరునామాగా బతుకమ్మ నిలుస్తుంది: తమిళిసై

మహిళల ఐక్యతకు చిరునామాగా బతుకమ్మ నిలుస్తుంది: తమిళిసై

హైదరాబాద్: తెలుగు యూనివర్సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలతో గవర్నర్‎కు తెలుగు యూనివర్సిటీ అధికారులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్.. తెలుగులో ప్రసంగించి.. రాష్ట్ర ప్రజలందరికి నవరాత్రి మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు బాష మీద పరిశోధనలు చేయాలి: ఎమ్మెల్సీ కవిత
తెలుగు యూనివర్సిటీలో గవర్నర్‎తో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. తెలంగాణా మరియు తెలుగు బాష మీద పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలుగు యూనివర్సిటీ అధికారులు కృషి చేయాలి. బతుకమ్మ పండగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది.

తెలంగాణ ప్రజలు గొప్పగా జరుపుకునే పండుగ: గవర్నర్ తమిళిసై

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్.. తెలుగులో ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికి నవరాత్రి మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ‘బతుకమ్మ వేడుకల్లో ప్రతిరోజూ పాల్గొనడం అనందంగా ఉంది. తెలంగాణ ప్రజలు గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ. మన పూర్వీకుల నుంచి భాష, అలవాట్లు మనం కూడా నేర్చుకోవాలి. ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్నా.. బతుకమ్మ తెలంగాణకి మాత్రమే పరితమైన గొప్ప పండుగ. ప్రతిరోజు ఒక్కో పేరుతో బతుకమ్మ చేసుకుంటాం. ఎన్నో ఏళ్ల క్రితమే మన పెద్దలకి ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధని బతుకమ్మ తెలియజేస్తుంది. ముద్ద పప్పు బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ ఇలా ఎన్నో ఆరోగ్యానికి మంచి చేసేవే. మహిళల ఐక్యతకు చిరునామాగా బతుకమ్మ నిలుస్తుంది. బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్సీ కవితకి నా శుభాకాంక్షలు. బతుకమ్మ రాజ్‎భవన్‎లో కూడా చేయడం నాకు సంతోషాన్ని ఇస్తుంది’ అని తమిళిసై అన్నారు.

For More News..

వర్షాలతో రూ. 8 వేల కోట్ల పంట నష్టం వస్తే.. కేంద్రం రూ. 8 కూడా ఇవ్వలే

కౌలు రైతులను మేం పట్టించుకోం: సీఎం కేసీఆర్

పండుగపూట పెట్రో మంట.. వరుసగా నాలుగో రోజు బాదుడు