వైభవంగా మల్లన్నకు పెద్దపట్నం

వైభవంగా మల్లన్నకు పెద్దపట్నం

మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లన్న ఆలయంలో శనివారం తెల్లవారుజామున పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 150 మంది ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో 41 వరుసలతో పెద్దపట్నం వేశారు. దేవస్థానం తరఫున తెచ్చిన ముగ్గులతో పాటు భక్తులు తెచ్చిన క్వింటాళ్ల కొద్దీ పసుపు, కుంకుమ, బియ్యం పిండి, పచ్చ ముగ్గులను పెద్దపట్నం వేయడానికి  వినియోగించారు. అర్చకులు పెద్దపట్నం దాటిన వెంటనే భక్తులు పసుపు, కుంకుమ తీసుకునేందుకు ఎగబడ్డారు.  - వెలుగు, కొమురవెల్లి

కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక పూజలు చేశారు. తోటబావి వద్ద 150 మంది ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో 41 వరుసలతో పెద్దపట్నం వేశారు. దేవస్థానం తరుఫున తెచ్చిన ముగ్గులతో పాటు భక్తులు తెచ్చిన క్వింటాళ్ల కొద్దీ పసుపు, కుంకుమ, బియ్యం పిండి, పచ్చ ముగ్గులను పెద్దపట్నం వేయడానికి  వినియోగించారు. అనంతరం ఆలయ గర్భగుడి నుంచి ఉత్సవ విగ్రహాలతో అర్చకులు ఊరేగింపుగా వచ్చి పెద్దపట్నం వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పెద్దపట్నం దాటిన వెంటనే భక్తులు, ఒగ్గు పూజారులు, శివసత్తులు పెద్దపట్నం దాటుతూ వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఓ దశలో భక్తులను కంట్రోల్​ చేయలేక పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి వచ్చింది.