యోగా గురుకు ఫుల్ డిమాండ్.. ఆన్‌లైన్‌లో నేర్చుకొని ట్రైనర్స్‌గా మారుతున్న యూత్

యోగా గురుకు ఫుల్ డిమాండ్.. ఆన్‌లైన్‌లో నేర్చుకొని ట్రైనర్స్‌గా మారుతున్న యూత్
  • లాక్ డౌన్‌లో పెరిగిన లెర్నర్స్
  • అందుబాటులో 1–3 నెలల కోర్సులు
  • రికగ్నైజ్డ్ వర్సిటీల నుంచి సర్టిఫికెట్

హైదరాబాద్, వెలుగు: గతేడాది కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్, జాబ్ ప్రెజర్, ఇతర టెన్షన్స్ ఇవన్నీ చాలామంది గ్రేటర్ జనాలను మెంటల్లీ వీక్ చేసేశాయి. ఈ క్రమంలో చాలామంది  యోగా, మెడిటేషన్ వైపు ఫోకస్ పెట్టారు. గతంతో పోలిస్తే లాక్ డౌన్ టైమ్ లో 5 నుంచి10 రెట్లు ఎక్కువగా క్లయింట్స్ పెరిగారని యోగా సెంటర్స్ నిర్వాహకులు చెప్తున్నారు. యోగా,మెడిటేషన్ లెర్నర్స్ పెరగడం, గ్రేటర్ సిటీలో ఒకప్పటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ రావడంతో 25–30 ఏండ్ల యువతలో చాలామంది దీన్నే ప్రొఫెషన్ గా మార్చుకుంటున్నారు. ఆన్ లైన్ లో యోగా కోర్సులు నేర్చుకుని ట్రైనర్స్ గా మారుతు న్నారు. గతేడాదితో పోలిస్తే యోగా టీచర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నవారి సంఖ్య డబుల్ అ య్యిందని పలు యోగా టీచింగ్ సంస్థల ప్రతినిధులు తెలిపారు.  ఇంట్రెస్ట్ ఉన్నవారికోసం నెల నుంచి 3 నెలల కోర్సులు అందుబాటులో ఉన్నా యంటున్నారు. ప్రతినెలా ఇందుకు సంబంధించి కొత్త బ్యాచ్ లు మొదలవుతుంటాయని వారు చెప్తున్నారు.

స్ట్రెస్ నుంచి బయటపడేందుకు..

కరోనా కారణంగా సిటీకి చెందిన యోగా సెంటర్స్ ఆన్ లైన్ లో కోర్సులను కండక్ట్ చేస్తున్నాయి. లాక్ డౌన్ లో  యాంగ్జైటీ, స్ట్రెస్ నుంచి బయటపడేందుకు, హెల్దీ లైఫ్ కోసం సిటిజన్స్ ఎక్కువగా మెడిటేషన్, యోగా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీరంతా ఆన్ లైన్ సెషన్స్ కి అటెండ్ అయి మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. లెర్నర్స్ పెరగడంతో యోగా,మెడిటేషన్ సెంటర్స్ కి ట్రైనర్స్ అవసరం కూడా ఏర్పడుతోంది. ఈ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని యువతతో పాటు 25–35 ఏండ్ల మహిళలు యోగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సర్టిఫికేట్ కోర్సు చేసి ట్రైనర్లుగా మారుతున్నారు. మరోవైపు యోగా నేర్చుకుంటున్నవారిలో పర్సనల్ ట్రైనర్ కోసం చూస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. అందరితో కాకుండా వన్ టు వన్ టీచింగ్ కోసం చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ట్రైనర్స్ కి  డిమాండ్ పెరుగుతోంది. ఆన్ లైన్ క్లాసులు అందుబాటులో ఉంటున్నా పర్సనల్ ట్రైనర్ ఉంటే బెటర్ అని కొందరు లెర్నర్స్ ఫీల్ అవుతున్నారు. దీంతో ప్రొఫెషనల్ ట్రైనర్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. దీంతో యోగాపై పట్టున్న వారు ప్రొఫెషనల్ కోర్సు చేసి టీచర్స్ గా మారుతున్నారు. వీరు  పర్సనల్ గా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఆన్ లైన్ లో జూమ్ క్లాసులను కండక్ట్ చేస్తున్నారు.

సర్టిఫికెట్ కోర్సు ఇలా..

యోగా,మెడిటేషన్ సర్టిఫికెట్ కోర్సుల్లో  అష్టాంగ యోగా, డెఫినేషన్స్, స్ట్రీమ్స్ ఆఫ్ యోగా వంటివి ఇన్ క్లూడ్ చేస్తున్నారు. కాన్సన్ ట్రేషన్, మైండ్ కంట్రోలింగ్, చిల్డ్రన్ యోగా, టీచింగ్ టెక్నిక్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తున్నారు. డైలీ గంటన్నర నుంచి 2 గంటల పాటు ఈ క్లాసులు ఉంటున్నాయి. అప్పడుప్పుడు  యోగా గురులతో స్పెషల్ గెస్ట్ లెక్చర్స్ కండక్ట్ చేస్తున్నారు. యోగా సెంటర్ తో  టైఅప్ అయిన యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ మోనిటరింగ్ కూడా ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక యూనివర్సిటీ కి చెందిన స్టాఫ్ ట్రైనింగ్ తీసుకున్న వారికి ప్రాక్టికల్, థియరీ పరంగా టెస్ట్ లు కండక్ట్ చేస్తారు. అందులో సరైన పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి సర్టిఫికెట్ అందిస్తున్నారు. 3 నెలల కోర్సు చేసిన వారు సంబంధిత యూనివర్సిటీకి వెళ్లి 15 రోజులు ఉండాల్సి వస్తుంది. స్టాఫ్ అబ్జర్వ్ చేసి టెస్టులు కండక్ట్ చేసిన తర్వాత వారికి సర్టిఫికెట్ అందిస్తారు.

ఫుల్ రెస్పాన్స్ వస్తోంది

బెంగళూరులోని వ్యాస యూని వర్సిటీతో మా యోగా సెంటర్ టైఅప్ అయ్యింది. మా దగ్గర టీచింగ్ కోర్సు చేసినవారికి వ్యాస వర్సిటీ నుంచి సర్టిఫికెట్ వస్తుంది. కోర్సు టైమ్​లో అక్కడి ఫ్యాకల్టీ అబ్జర్వేషన్​, ఆన్ లైన్ టెస్టులు ఉంటాయి.    లాక్ డౌన్ లో యోగాకు క్రేజ్ పెరగడంతో చాలామంది  దీన్ని  ప్రొఫెషన్ గా మార్చుకుంటున్నారు.

 – శ్రీనివాస్ అల్లూరి, విశ్వ మానవత సమానత యోగా సెంటర్, కూకట్​పల్లి

వన్ మంత్ కోర్సు చేస్తున్నా

నాకు యోగా చేయడం అంటే ఇంట్రెస్ట్. యూట్యూబ్ లో చూస్తూ కొన్ని ఆసనాలు నేర్చుకున్నా. తర్వాత దీన్నే ప్రొఫెషన్ గా మార్చుకోవాలని డిసైడ్ అయ్యా. నెలరోజుల కోర్సు కోసం ఓ యోగా సెంటర్ లో జాయిన్ అయ్యా. నాతో పాటు 20 మంది ఈ కోర్సు చేస్తున్నారు. ఆన్ లైన్ లో డైలీ క్లాసులు, మానిటరింగ్ ఉంటుంది.
– రేణు శ్రీ, యోగా స్టూడెంట్,మణికొండ 

For More News..

మూడు నెలలుగా సౌదీలో డెడ్​బాడీ.. తెప్పించాలంటూ కుటుంబసభ్యుల వినతి

రేషన్‌కు మొబైల్ నెంబర్ లింక్.. మీ సేవా సేంటర్ల వద్ద బారులు