స్టాండెలోన్​, కన్సాలిడేటెడ్​ లాభాల మధ్య చాలా తేడా

స్టాండెలోన్​, కన్సాలిడేటెడ్​ లాభాల మధ్య చాలా తేడా

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్  స్టాండెలోన్​, కన్సాలిడేటెడ్​ నికర లాభం (ప్యాట్​) మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరిగింది. ఇది గత రెండేళ్లలో  రూ. 22,400 కోట్లకు ఎగిసింది.  టెలికాం,  రిటైల్ వృద్ధి కారణంగా ఈ తేడా 2020- ఆర్థిక సంవత్సరంలో రూ. 8,400 కోట్ల నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 22,400 కోట్లకు పెరిగిందని జేపీ మోర్గన్​ తెలిపింది. 

రిలయన్స్ 2019-–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,902 కోట్ల స్టాండెలోన్​ నికర లాభాన్ని నివేదించింది. ఇది 2022–-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 44,205 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.39,354 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.66,702 కోట్లకు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు లాభాల మధ్య వ్యత్యాసానికి 335 వ్యక్తిగత స్వతంత్ర కంపెనీలు/అసోసియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కారణం.