బంగారంపై భారీ డిస్కౌంట్లు..

బంగారంపై భారీ డిస్కౌంట్లు..

న్యూఢిల్లీ: డిమాండ్ రికవరీ కోసం గోల్డ్డీలర్లు తప్పనిసరి పరిస్థితుల్లో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. దేశీయంగా ధరలు రూ.50 వేలకు పైన పలుకుతుండటంతో, గోల్డ్ డీలర్లు డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇండియాలో గోల్డ్‌‌ డిస్కౌంట్లు గత ఐదు నెలల కాలంలో ఎన్నడూ లేనంతగా ఒక ఔన్స్‌‌కు 43 డాలర్లను  ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడైంది. గత వారం వరకు గోల్డ్డీలర్లు 20 డాలర్ల డిస్కౌంట్లు ఆఫర్ చేసే వారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఇండియాలో  గోల్డ్ రేట్లలో 12.5 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీ కలిసి ఉంటాయి. ఎంసీఎక్స్ లో అక్టోబర్ నెల గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ .51,399గా నమోదైంది. ఈ నెల 7న గోల్డ్ధరలు రూ.56,200 మార్క్‌‌ను తాకి తర్వాత కరెక్షన్‌‌కు గురయ్యాయి. డిమాండ్‌ లేకపోవడంతోపాటు, గోల్డ్ స్క్రాప్ ‌రాక పెరగడంతో డిస్కౌంట్లను ఎక్కువగా ప్రకటిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనాతో రిస్క్ సెంటిమెంట్ పెరగడంతో గ్లోబల్ మార్కెట్లలో కూడా గోల్డ్రేట్లుఈ నెల 7న ఒక ఔన్స్‌‌కు 2,051 డాలర్ల వద్ల్ద నమోదయ్యాయి. ఇటీవల గోల్డ్ ధరలు కాస్త తగ్గినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్  ధరలు 28 శాతం పెరిగాయి. కరోనా వైరస్‌ వల్ల ఎకానమీలకు తలెత్తిన ఇబ్బందుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంక్‌‌ లు భారీగా స్టిములపై ప్యాకేజీలు ఇచ్చాయి. ఈ ప్యాకేజీలతో గోల్డ్ ధరలు పుంజుకున్నాయి. అయితే గోల్డ్ధరలు పైకి ఎగియడంతో కన్జూమర్ల నుంచి డిమాండ్ బాగా తగ్గిపోయింది . మరోవైపు కరోనాతో ప్రజలు కూడా దుకాణాలకు వచ్చేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ వినియోగదారుగా పేరున్న చైనాలో కూడా ఒక ఔన్స్‌‌కు 60 డాలర్లనుంచి 70 డాలర్ల వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది.