కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

కామారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల ఓ పాత ఇనుప సామాను దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భారీ శబ్దాలు రావడంతో చుట్టూ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు.  వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫైర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 

ఇనుప సామాను దుకాణంలో గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లుగా ఫైర్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలో ఏమైన ప్రాణనష్టం జరిగిందా అనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.  రోడ్డుపై చెత్తను మున్సిపల్ కార్మికులు ఊడ్చి చెత్తకు మంటపెట్టడం వల్లే మంటలు వచ్చాయని అనుమానిస్తున్నారు స్థానికులు. ఫైర్ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు.