చైనాలో భారీ అగ్ని ప్రమాదం

చైనాలో భారీ అగ్ని ప్రమాదం

చైనాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి బిల్డింగ్ ఆహుతైంది.  సెంట్రల్ చైనా సిటీ చాంగ్షాలోని , హునాన్స్ ప్రావిన్స్‌లోని భారీ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. దాదాపు 200 మీటర్ల కంటే ఎత్తయిన ఈ భారీ బిల్డింగ్ లో మంటలు అంటుకోవడంతో..పొగలు ఆకాశాన్ని తాకాయి. దట్టమైన మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు..మంటలను అదుపులోకి తెచ్చాయి. 

42 అంతస్తులు కలిగిన అత్యంత ఎత్తైన బిల్డింగులో మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల ఉన్న భవనాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ బిల్డింగులో ప్రభుత్వానికి చెందిన టెలికాం కార్యాలయం  కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదంలో ఎవరూ మరణించలేదని..అధికారులు తెలిపారు.