
హాలియా, వెలుగు: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు 4,09,921 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ నిండుకుండలా మారి కనువిందు చేస్తోంది. 26 క్రస్ట్ గేట్ల ను10 ఫీట్లను పైకి ఎత్తి 3,60,724 క్యూసెక్కుల నీటిని దిగువకువదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ 590 అడుగుల(312. 0450 టీఎంసీలు)కు గాను ప్రస్తుతం 584. 50 అడుగులు( 295.9925 టీఎంసీ ) మెయింటెన్ చేస్తున్నారు.
ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 32,155 , కుడికాల్వకు 9,019 , ఎడమకాల్వకు 7,353, ఎమ్మార్పీకు 2,400 , ఎల్ఎల్సీకి 300 క్యూసెక్కుల చొప్పున మొత్తంగా 4,09,921 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వదులుతున్నారు. పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తుండగా డ్యామ్ వద్ద సందడి నెలకొంది.
బాల్కొండ: శ్రీరాంసాగర్ కు ఎగువ నుంచి 75 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 8 గేట్ల ద్వారా 49, 280 క్యూసెక్కులు అవుట్ ఫ్లోగా వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (80.50టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రం 1090.26 అడుగులు(79.26టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఇరిగేషన్ ఏఈ రవి తెలిపారు. వరద కాల్వకు 20వేలు, ఎస్కేప్ గేట్లకు 4,500, కాకతీయ కెనాల్ కు 3,500, సరస్వతీ కెనాల్ కు 500, లక్ష్మీ కాల్వకు 150క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్టు చెప్పారు. 36.40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్ కో డీఈ శ్రీనివాస్ తెలిపారు.