ఐఓసీఎల్‎లో భారీగా అప్రెంటీస్ పోస్టులు.. పూర్తి అర్హతలు ఇవే

ఐఓసీఎల్‎లో భారీగా అప్రెంటీస్ పోస్టులు.. పూర్తి అర్హతలు ఇవే

రీఫైనరీ డివిజన్‎లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐఓసీఎల్ వెబ్​సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ జూన్ 2.

పోస్టుల సంఖ్య: 1770

  • పోస్టులు: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) కెమికల్ – 421, ఫిట్టర్ (మెకానికల్) 208, బాయిలర్ (మెకానికల్) 76, కెమికల్ 356, మెకానికల్ 169, ఎలక్ట్రికల్ 240, ఇనుస్ట్రుమెంటేషన్ 108, సెక్రటేరియల్ అసిస్టెంట్ 69, అకౌంటెంట్ 38, డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్ అప్రెంటీస్) – 53, డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్) 32
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మూడేండ్ల బీఎస్సీ డిగ్రీ, ఫిట్టర్ ట్రేడులో ఐటీఐతోపాటు మెట్రిక్, కెమికల్ ఇంజినీరింగ్/ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్ టెక్నాలజీ/ రీఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్​లో మూడేండ్ల డిప్లొమా, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్​లో మూడేండ్ల డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీకాం, 12వ తరగతి, 12వ తరగతితోపాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటింగ్​​లో స్కిల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
  • వయోపరిమితి: కనిష్ట వయస్సు 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 24 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • లాస్ట్ డేట్: జూన్ 2.
  • డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్: జూన్ 16 నుంచి జూన్​ 24. పూర్తి వివరాలకుwww.iocl.com/www.iocrefrecruit.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

►ALSO READ | Jobs alert: దశాబ్దంలోనే SBI అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్.. 18 వేల పోస్టలకు త్వరలో నోటిఫికేషన్.. డీటైల్స్ ఇవే