ఐపీఎల్‌‌ మీడియా రైట్స్‌‌ @ 60 వేల కోట్లు?

ఐపీఎల్‌‌ మీడియా రైట్స్‌‌ @ 60 వేల కోట్లు?
  • ఐపీఎల్‌‌ మీడియా రైట్స్‌‌ ద్వారా బీసీసీఐకి భారీ ఆదాయం ?
  • బ్రోకరేజ్‌‌ సంస్థ ఎలారా సెక్యూరిటీస్‌‌ అంచనా

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ మీడియా రైట్స్‌‌ ద్వారా బీసీసీఐకి భారీ ఆదాయం వచ్చే చాన్స్‌‌ కనిపిస్తోంది. వచ్చే ఐదేళ్లకు (2023–-28) మీడియా రైట్స్‌‌ ద్వారా రూ. 50 వేల కోట్లు రాబట్టాలని అంచనా వేసిన బోర్డుకు బ్రోకరేజ్‌‌ సంస్థ ఎలారా సెక్యూరిటీస్‌‌ గుడ్‌‌ న్యూస్‌‌ చెప్పింది. ఐపీఎల్‌‌–15 సూపర్‌‌ హిట్‌‌ కావడంతో మీడియా రైట్స్‌‌కు  భారీ ధర పలికే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తద్వారా దాదాపు రూ. 60 వేల కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేసింది. ప్రతి మ్యాచ్‌‌కు ఐపీఎల్‌‌ డిజిటల్‌‌ బేస్‌‌ప్రైస్‌‌ రూ. 33 కోట్లుగా ఉంది.  వేలంలో ఇది  రూ. 65 నుంచి 66 కోట్ల మధ్య పలుకుతుందని అంచనా వేసింది.  ఇక ప్రతి మ్యాచ్‌‌కు ఐపీఎల్‌‌ బ్రాడ్‌‌కాస్ట్‌‌ బేస్‌‌ప్రైస్‌‌ రూ. 49 కోట్లు కాగా, రూ. 40 నుంచి 50% పెరుగుదల ఉండనుంది. దీంతో రూ. 65 నుంచి 70 కోట్ల ఆదాయం రావొచ్చని ఎలారా చెబుతోంది.  టీవీ బ్రాడ్‌‌కాస్టర్‌‌కు ఏడాదిలో 6 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసిన ఎలారా.. వచ్చే ఐదేళ్లలో ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌ల కోసం డిజిటల్‌‌ రైట్స్‌‌లో 35 శాతం పెరుగుదల ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఐపీఎల్‌‌ మీడియా రైట్స్‌‌ కోసం డిస్నీ హాట్‌‌స్టార్‌‌, సోనీ నెట్‌‌వర్క్‌‌, వయకామ్‌‌ రిలయన్స్‌‌, జీ ఎంటర్‌‌టైనమెంట్‌‌, అమెజాన్‌‌, ఆపిల్‌‌, గూగుల్‌‌.. బిడ్‌‌ డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయి.