తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. సప్తగిరులు గోవింద నామ స్మరణతో మార్మోగుతున్నాయి. స్వామి వారి దర్శనానికి వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు భక్తులు. సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం 76 వేల 821 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 78 లక్షలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
